Naresh- Pavitra Lokesh: ఎయిర్ పోర్టులో జంటగా నరేష్- పవిత్రా లోకేష్.. ఓ అజ్ఞాత మహిళ దగ్గరకు వచ్చి ఏం చేసిందంటే?

టాలీవుడ్ నటుడు నరేష్, పవిత్ర లోకేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ సహజీవనం చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఈ ప్రేమ పక్షులు హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మళ్లీ జంటగా కనిపించారు. అయితే ఓ మహిళ వీరిని చూసి దగ్గరకు వచ్చి..

Naresh- Pavitra Lokesh: ఎయిర్ పోర్టులో జంటగా నరేష్- పవిత్రా లోకేష్.. ఓ అజ్ఞాత మహిళ దగ్గరకు వచ్చి ఏం చేసిందంటే?
Naresh, Pavitra Lokesh

Updated on: May 21, 2025 | 6:33 PM

నరేష్, పవిత్ర లోకేష్  ప్రేమలో మునిగి తేలుతోన్న సంగతి తెలిసిందే. గత కొన్నేళ్లుగా వీరిద్దరూ సహ జీవనం చేస్తున్నారు.
తామిద్దరం పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇదివరకే ఇద్దరూ ప్రకటించారు. అందుకు తగ్గట్టుగానే సినిమా ఈవెంట్స్, ఫంక్షన్లలోనూ జంటగానే కనిపిస్తున్నారు. సోషల్ మీడియాలో వీరిపై ట్రోలింగ్ జరుగుతున్నా నరేష్ కానీ, పవిత్ర కానీ పెద్దగా పట్టించుకోవడం లేదు. తమకు నచ్చినట్లు లైఫ్ ను లీడ్ చేస్తన్నారు. తాజాగా నరేష్, పవిత్రా లోకేష్ హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో సందడి చేశారు. వెకేషన్ కోసం వెళుతూ విమానాశ్రమంలో జంటగా కనిపించారు. అయితే ఒక మహిళ వీరిని చూసింది. వెంటనే వారి దగ్గరకు వెళ్లి కొన్ని స్వీట్స్ ను బహుమతిగా ఇచ్చింది. ఈ విషయాన్ని నరేష్ సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. ‘ఆమె ఎవరో తెలియదు కానీ, హైదరాబాద్ విమానాశ్రయంలో పవిత్రను, నన్ను కలిసి.. మీరు ఆమెపై చూపించే శ్రద్ధ, ప్రేమ మీరు ఆమెను అమ్ము అని పిలిచే విధానం నన్ను హత్తుకున్నాయి. మీరు గొప్ప పెద్ద మనిషి. మీ జీవితంలో ఆమెను పొందడం మీ అదృష్టం. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు అని చెప్పి వెళ్లిపోయింది. అంతే కాదు మాకు కొన్ని స్వీట్లు కూడా బహుమతిగా ఇచ్చింది. ఆమె మాటలు, ముఖంలోని నిజాయితీ అన్నీ చెప్పాయని.. ఆమె ఎవరైనా తాము జీవితాంతం గుర్తుంచుకుంటామని చెప్పారు. ‘ఇది మా లైఫ్‌లో మెమొరబుల్ మూమెంట్. చాలా థ్యాంక్స్’ అని రాసుకొచ్చాడు నరేష్.

ప్రస్తుతం నరేష్ షేర్ చేసిన పోస్ట్ నెట్టింట వైరలవుతోంది. దీనిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా నరేష్, పవిత్ర ఇద్దరూ కలిసి ‘మళ్లీ పెళ్లి’ అనే సినిమాలో నటించారు. అయితే ప్రస్తుతం పవిత్ర మాత్రం సినిమాలకు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తోంది. అదే సమయంలో నరేష్ మాత్రం వరుసగా సినిమాల్లో నటిస్తున్నాడు. సహాయ నటుడిగా పలు చిత్రాలతో బిజీగా ఉంటున్నాడు.

ఇవి కూడా చదవండి

ఎయిర్ పోర్టులో నరేష్, పవిత్రా లోకేష్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.