Yash : మరో విషాదం.. యష్ ఎస్కార్ట్ వాహనాన్నిఢీకొని మరొక అభిమాని మృతి

|

Jan 09, 2024 | 12:13 PM

ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్‌ను ఏర్పాటు చేస్తున్న ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి గురయ్యారు. మరో ముగ్గురు అభిమానులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. అయితే చనిపోయిన వారి కుటుంబాలను యష్ పరామర్శించారు. దయచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు యష్ అభిమాని మరొకరు కూడా మృతి చెందారు

Yash : మరో విషాదం.. యష్ ఎస్కార్ట్ వాహనాన్నిఢీకొని మరొక అభిమాని మృతి
Yash
Follow us on

కన్నడ స్టార్ హీరో యష్ పుట్టిన రోజున తీవ్ర విషాదం జరిగిన విషయం తెలిసిందే. తమ అభిమాన హీరో పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ.. బ్యానర్ కడుతూ ముగ్గురు అభిమానులు కన్నుమూశారు. రాకింగ్ స్టార్ యష్ 38వ పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ బ్యానర్‌ను ఏర్పాటు చేస్తున్న ముగ్గురు అభిమానులు విద్యుదాఘాతానికి గురయ్యారు. మరో ముగ్గురు అభిమానులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చేరారు. అయితే చనిపోయిన వారి కుటుంబాలను యష్ పరామర్శించారు. దయచేసి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు అని విజ్ఞప్తి చేశారు. ఇదిలా ఉంటే ఇప్పుడు యష్ అభిమాని మరొకరు కూడా మృతి చెందారు.

గాయపడిన వారిని చూసేందుకు యశ్ ఆసుపత్రికి వెళ్లి తిరిగి వస్తుండగా మరో ప్రమాదం జరిగింది. యశ్‌కు భద్రత కల్పిస్తున్న పోలీసు వాహనాన్ని ద్విచక్రవాహనం ఢీకొనడంతో నిఖిల్ అనే యువకుడు తలకు బలమైన గాయమై ఆస్పత్రిలో చేరాడు. అయితే చికిత్స పొందుతూక నిఖిల్ ఈరోజు ఉదయం మృతి చెందాడు. మృతుడు నిఖిల్ గడగ్ తాలూకా బింకదకట్టి గ్రామానికి చెందినవాడు.

తన అభిమాన హీరో యశ్‌ను చూసేందుకు అతడిని వెంబడించిన నిఖిల్.. స్కూటీ పై వేగంగా రోడ్డుపై వెళ్తున్న యష్ ఎస్కార్ట్ వాహనాన్ని ఢీకొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిఖిల్‌ను పోలీసు వాహనంలో గడగ్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ నిఖిల్ మృతి చెందాడు. పుట్టినరోజు సందర్భంగా ఇలా అభిమానులు మృతి చెందడం యాష్‌ని షాక్‌కు గురి చేసింది. పుట్టిన రోజులు చేసుకోవాలంటేనే భయంగా ఉంది అని యష్ తెలిపాడు. దయచేసి ప్రాణాలను పణంగా పెట్టకండి. మీ కుటుంబంలో కన్నీరు నింపకండి అంటూ యష్ అభిమానులకు విజ్ఞప్తి చేశాడు. చనిపోయిన వారి కుటుంబాలను పరామర్శించిన యష్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ కుటుంబాలకు అండగా ఉంటాను అని తెలిపాడు యష్.

యాష్ ట్విట్టర్ లేటెస్ట్ పోస్ట్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి