విశాల్ హీరోగా నటించిన సినిమాల పై ప్రేక్షకులకు ఆసక్తి ఉంటుంది. డిఫరెంట్ కంటెంట్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు విశాల్. తెలుగులోనూ విశాల్ కు మంచి మార్కెట్ ఉంది. విశాల్ నటించిన ఓ సినిమా ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ సినిమా పేరు మద గజ రాజా. ఈ సినిమాకు నటుడు సుందర్ సి దర్శకత్వం వహించారు. నిజానికి ఈ సినిమాను 2013లో విడుదల చేయాలి. కానీ అప్పుడు విడుదల ఆగిపోయింది. విశాల్ నటించిన ఈ చిత్రంలో అంజలి, వరలక్ష్మి శరత్‌కుమార్‌లు కలిసి నటించారు.
పూర్తిగా కామెడీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రాన్ని 2013 పొంగల్ పండుగ సందర్భంగా విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు. ఆర్థిక సమస్యల కారణంగా అప్పుడు సినిమా విడుదల కాలేదు. ఈ సందర్భంలో, సుమారు 12 సంవత్సరాల తరువాత, ఈ చిత్రాన్ని వచ్చే పొంగల్ పండుగకు థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఈ చిత్రాన్ని పొంగల్ కానుకగా జనవరి 12న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది.
ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. తమిళ్ లో పెద్దగా పోటీ లేకపోయినా.. తెలుగులో మాత్రం బడా సినిమాలు ఉన్నాయి. శంకర్ గేమ్ ఛేంజర్, బాలకృష్ణ డాకూ మహారాజ్ , అలాగే వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం ఈ సినిమాలు మధ్యలో ఇప్పుడు విశాల్ సినిమా రిలీజ్ కానుంది. దాదాపు 12 ఏళ్ల తర్వాత విడుదలవుతున్న ఈ సినిమాని చూసేందుకు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నటుడు సంతానం ఈ చిత్రంలో కమెడియన్‌గా నటించారు.స్వరకర్త విజయ్ ఆంటోని ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ సినిమాలో నటుడు విశాల్ పాడిన పాట నేటికీ ఇంటర్నెట్‌లో పాపులర్. 12 ఏళ్ల తర్వాత ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలోకి రావడం విశాల్ అభిమానులకు ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి ఈ సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తారా లేక కేవలం తమిళ్ లోనే రిలీజ్ చేస్తారా అన్నది చూడాలి.
Kings of Entertainment @VishalKOfficial #SundarC @iamsanthanam
A @vijayantony musicalare all set to make this Pongal a Laughter Festival.
Gemini Film Circuit’s#MadhaGajaRaja
worldwide release on Jan 12.#MadhaGajaRajaJan12
#MGR #மதகஜராஜா @johnsoncinepro pic.twitter.com/9gfRXMUkH0— Santhanam (@iamsanthanam) January 3, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి