AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vijay Deverakonda: మెట్లపై పడిపోయిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజ్ గురించి తెలిసిందే. ముఖ్యంగా అమ్మాయి కలల హార్ట్ ఫేవరేట్. అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డమ్ అందుకున్న విజయ్.. ఇప్పుడు చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. తాజాగా ఈ హీరోకు సంబంధించిన ఓ వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది.

Vijay Deverakonda: మెట్లపై పడిపోయిన విజయ్ దేవరకొండ.. వీడియో వైరల్..
Vijay Deverakonda
Rajitha Chanti
|

Updated on: Nov 08, 2024 | 6:21 PM

Share

టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కొత్త ప్రాజెక్ట్స్ చిత్రీకరణలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఖుషి సినిమాతో ప్రేక్షకులను అలరించిన విజయ్.. ఇప్పుడు తన తదుపరి సినిమాల విషయంలో అచి తూచి అడుగులు వేస్తున్నాడు. ఇటీవలే తన ప్రాజెక్ట్ కు సంబంధించిన షూటింగ్ షెడ్యూల్ కేరళలో పూర్తి చేశాడు. ప్రస్తుతం విజయ్ నటిస్తున్న సినిమా VD12 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతుంది. ఈ చిత్రానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తుండగా.. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇదే కాకుండా మరో రెండు ప్రాజెక్ట్స్ లైన్లో పెట్టాడు విజయ్.

టాక్సీవాలా సినిమా డైరెక్టర్ రాహుల్ సంకృత్యాన్, రవి కిరణ్ కోలాల డైరెక్షన్లలో విజయ్ సినిమాలు చేయనున్నారు. ఇదంతా పక్కన పెడితే.. తాజాగా విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. అందులో విజయ్ మెట్లపై నడుస్తూ అనుకోకుండా కింద పడ్డాడు. తాజాగా ముంబైలో ఓ ఈవెంట్లో పాల్గొన్నాడు విజయ్. అనంతరం ఆ ఈవెంట్ నుంచి బయటకు వస్తూ అనుకోకుండా స్టెప్స్ పై పడిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా.. ఫ్యాన్స్ ఆందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో విజయ్ కు ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. కిందపడిన వెంటనే పక్కన ఉన్న సిబ్బంది అలర్ట్ అయ్యి ఆయనను పైకి లేపగా.. ఆ తర్వాత విజయ్ సాధారణంగా నడుచుకుంటూ వెళ్లిపోయారు.

ప్రస్తుతం విజయ్ హిందీలో ఓ ప్రైవేట్ ఆల్బమ్ చేస్తున్నారు. ఈరోజు ఆ పాటకు సంబంధించిన పోస్టర్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ హీరోయిన్ రాధికా మదన్ తో కలిసి విజయ్ సాహిబా అనే సాంగ్ చేస్తున్నారు. ఇది విజయ్ కెరీర్ లో ఫస్ట్ హిందీ మ్యూజిక్ వీడియో.. ఈ పాటకు బాలీవుడ్ పాప్ సింగర్ జస్లీన్ రాయల్ మ్యూజిక్ అందిస్తుండగా.. సుధాన్షు సారియా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సాంగ్ కోసమే విజయ్ ముంబై వెళ్లినట్లు సమాచారం.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.