
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు అతడు స్టార్ హీరో. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో మెప్పించాడు. కానీ కెరీర్ తొలినాళ్లల్లో వచ్చిన క్రేజ్ మాత్రం కాపాడుకోలేకపోయాడు. తెలుగు సినీ పరిశ్రమలో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నీ ఆ హీరో ఊహించని రీతిలో ఫెడ్ అవుట్ అయ్యాడు. కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న ఆ హీరో.. ఇప్పుడు ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడిప్పుడే వరుస సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అయితే ఇప్పుడు ఆ స్టార్ కానిస్టేబుల్ గా మారాడు. అంటే నిజంగా కాదండి.. సినిమా కోసం. అతడు మరెవరో కాదండి.. యంగ్ హీరో వరుణ్ సందేశ్.
హ్యాపీడేస్ సినిమాతో హీరోగా పరిచయమైన వరుణ్ సందేశ్…ఆ తర్వాత కొత్త బంగారు లోకం సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. ఈ సినిమాతో వరుణ్ కు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది. కానీ ఆ తర్వాత అతడు నటించిన చిత్రాలన్ని డిజాస్టర్స్ అయ్యాయి.దీంతో కొన్నాళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్నాడు. ఇప్పుడిప్పుడే తిరిగి సినిమాల్లో నటిస్తున్న వరుణ్.. తాజాగా తన కొత్త సినిమాను అనౌన్స్ చేశాడు. ప్రస్తుతం వరుణ్ సందేశ్ హీరోగా నటిస్తున్న సినిమా కానిస్టేబుల్. సుభాన్ ఎస్.కె దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్ పై బలగం జగదీష్ నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ సందేశ్ సరసన మధులిక వారణాసి కథానాయికగా నటిస్తున్నారు.
“కానిస్టేబులన్నా కానిస్టేబులన్నా సమాజమే నీ సేవకు సలాం అంటుందన్న…కానిస్టేబులన్నా” అంటూ సాగే పాటను ఇటీవలే హైదరాబాద్ పోలీస్ కమీషనర్ సివి ఆనంద్ చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ పాటకు శ్రీనివాస్ తేజ సాహిత్యాన్ని అందించగా.. సుభాష్ ఆనంద్ సంగీతాన్ని అందించారు. నల్గొండ గద్దర్ నర్సన్న పాట ఆలపించారు.
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..