Actor Uttej : ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇప్పుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్..

ఉత్తేజ్.. తన నటనతో, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రాలు చేస్తూ నటుడిగా కంటిన్యూ అవుతున్నారు ఉత్తేజ్.

Actor Uttej : ఉన్నంత కాలం నాకు పరిష్కారమై.. ఇప్పుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. ఉత్తేజ్ ఎమోషనల్ పోస్ట్..
Uttej

Updated on: Nov 24, 2021 | 3:44 PM

Actor Uttej : ఉత్తేజ్.. తన నటనతో, కామెడీ టైమింగ్, డైలాగ్ డెలివరీతో మంచి పేరును సంపాదించుకున్నారు. ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్రాలు చేస్తూ  నటుడిగా కంటిన్యూ అవుతున్నారు ఉత్తేజ్. ఇదిలా ఉంటే ఇటీవల ఆయన సతీమణి పద్మ క్యాన్సర్ కారణంగా కన్నుమూశారు. భార్య తన నుంచి దూరమై పోవడంతో ఉత్తేజ్ ఆమె స్మృతుల్లో గడిపేస్తున్నారు. ఆయన సతీమణి చనిపోయిన సమయంలో ఉత్తేజ్ ను చూస్తే హృదయం ద్రవించిపోయింది. భార్యను తలచుకొని వెక్కివెక్కి ఏడ్చారు ఉత్తేజ్. ఆసమయంలో ఉత్తేజ్ ను ఓదార్చడం ఎవరివల్లా కాలేదు. మెగాస్టార్ కూడా కంటతడి పెట్టుకున్నారు. నేడు ఉత్తేజ్ సతీమణి పద్మ పుట్టిన రోజు. దాంతో మరోసారి ఎమోషనల్ అయ్యారు ఉత్తేజ్

సోషల్ మీడియా వేదికగా ఆయన తన భార్యను తలుచోకొని భావోద్వేగానికి గురయ్యారు. “పుట్టినరోజు శుభాకాంక్షలు పద్దమ్మ… ఉన్నంత కాలం నాకు పరిష్కారమై..ఇప్పుడు ప్రశ్న నిచ్చి వెళ్ళావు.. చాలా నొప్పి పద్దు… నా చివరిశ్వాస తోనే నువ్వు నాలోంచి వెళ్ళేది…. లవ్ యూ పద్దమ్మా. మయూఖ పిల్లలంతా నిన్ను గుర్తు చేసుకుంటూనే ఉన్నారు…” అంటూ రాసుకొచ్చారు. ఈ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్ట్ చూసిన ప్రతిఒక్కరూ ఎమోషనల్ అవుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Pooja Hegde: మరోసారి లెహరాయి పాటకు స్టెప్పులేసిన బుట్టబొమ్మ.. హిట్ మూడ్‍లో పూజా హెగ్డే..

ముసిముసి నవ్వులు నవ్వుతోన్న ఈ చిన్నారి ఇప్పుడు కుర్రాళ్ల మనసులు దోచేస్తోంది.. ఎవరో గుర్తుపట్టారా!

Jayasudha New Look: షాకింగ్ లుక్‏లో జయసుధ.. సహజనటిని ఇలా ఎప్పుడైనా చూశారా ?..