Actor Suriya: నెలకు రూ.1200 జీతానికి గార్మెంట్ కంపెనీలో ఉద్యోగం.. నచ్చక ఆ పని చేసిన హీరో సూర్య..

|

Jul 26, 2024 | 10:10 AM

తాజాగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి శివకుమార్, హీరో కార్తీ, సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. తాను నటుడిగా ఎలా మారారో చెప్పారు. జీవితానికి సంంబధించి విద్యార్థులు కలలు కనాలని.. వాటిని నెరవేర్చుకోవడానికి అన్ని విధాలుగా శ్రమించాలన్నారు.

Actor Suriya: నెలకు రూ.1200 జీతానికి గార్మెంట్ కంపెనీలో ఉద్యోగం.. నచ్చక ఆ పని చేసిన హీరో సూర్య..
Suriya
Follow us on

కోలీవుడ్ హీరో సూర్యకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. తమిళంతోపాటు తెలుగు, హిందీలో పలు చిత్రాల్లో నటించి నేషనల్ వైడ్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. హీరోయిజం, మాస్ యాక్షన్ చిత్రాలు కాకుండా కంటెంట్ ప్రధానంగా చూసుకుంటూ మెసేజ్ ఓరియెంటేడ్ చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. వైవిధ్యమైన పాత్రలతో విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న హీరో సూర్య.. అటు సినిమాలే కాకుండా పేద పిల్లలకు ఉచితంగా ఉన్నత విద్య, ఉద్యోగ నైపుణ్యాలు అందిస్తున్నారు. ఇందుకోసం కొన్నేళ్ల క్రితం సొంతం అగరం ఫౌండేషన్ స్థాపించారు. తాజాగా ఈ ఫౌండేషన్ ఆధ్వర్యంలో చెన్నై వేదికగా జరిగిన ఓ కార్యక్రమంలో సూర్య పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సూర్య తండ్రి శివకుమార్, హీరో కార్తీ, సూర్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా సూర్య మాట్లాడుతూ.. తాను నటుడిగా ఎలా మారారో చెప్పారు. జీవితానికి సంంబధించి విద్యార్థులు కలలు కనాలని.. వాటిని నెరవేర్చుకోవడానికి అన్ని విధాలుగా శ్రమించాలన్నారు.

సూర్య మాట్లాడుతూ..”మన మనసు స్టీరింగ్ లాంటిది. గోల్ వైపు అది మళ్లే విధంగా చేయాల్సిన బాధ్యత మనదే. స్కూల్ లేదా కాలేజీలో ఉన్నప్పుడు నేను ఏమీ సాధించలేదు.. చదువు పూర్తైన తర్వాత గార్మెంట్ పరిశ్రమలో పనిచేశాను. రూ.1200 జీతం. కానీ ఆ ఉద్యోగం నచ్చలేదు. దాదాపు మూడు నెలల తర్వాత ఉద్యోగం వదిలేశాను. ఆ సమయంలో జీవితంలో యూటర్న్ తీసుకున్నాను.. అప్పుడే నటుడిగా మారాలని అనుకున్నాను.. షూటింగ్ ఐదు రోజుల ముందు వరకు నటుడిగా మారుతున్నాను అంటే నమ్మకం కలగలేదు. నేరుక్కు నేర్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను.. విజయ్ హీరోగా మణిరత్నం నిర్మించిన ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అడియన్స్ ప్రేమాభినాలు చూసి నేను నటుడిగా అర్హుడినే అనుకున్నాను.. కష్టపడి, క్రమశిక్షణతో పనిచేయాలనుకున్నాను. ఈరోజు ఈ స్థాయికి వచ్చాను. మీ అందరి ప్రేమాభిమానాలు పొందుతున్నాను ” అని అన్నారు.

జైభీమ్ సినిమా డైరెక్టర్ టీజే జ్ఞానవేలు జర్నలిస్టుగా పరిచయమై స్నేహితుడయ్యాడని.. నిరుపేద విద్యార్థులకు సాయం చేస్తుంటాడని… అతడితో కలిసి అగరం ఫౌండేషన్ స్థాపించినట్లు చెప్పుకొచ్చారు. అగరం అంటే ‘అ’ కారం.. అంటే తొలి అక్షరం అని అన్నారు.