నేనూ భారత పౌరుడ్నే..సూర్య భావోద్వేగ లేఖ!

| Edited By: Pardhasaradhi Peri

Jul 20, 2019 | 2:53 PM

కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై తమిళ  స్టార్ హీరో సూర్య చేసిన సంచలన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. నీట్ పరీక్షలు నిర్వహించే విధానం సరిగ్గా లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపాయి. దీంతో నటుడు సూర్యను టార్గెట్‌ చేయడంతో మనస్థాపం చెందిన ఆయన భావోద్వేగ లేఖను విడుదల చేశారు. నీట్‌ గురించి మాట్లాడే అర్హతలేదంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విద్యాభ్యాసంలో ఇబ్బందులపై మాట్లాడితే తనను టార్గెట్‌ చేయడం బాధకలిగిందని.. […]

నేనూ భారత పౌరుడ్నే..సూర్య భావోద్వేగ లేఖ!
Follow us on

కేంద్రం ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యావిధానంపై తమిళ  స్టార్ హీరో సూర్య చేసిన సంచలన కామెంట్స్ పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. నీట్ పరీక్షలు నిర్వహించే విధానం సరిగ్గా లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రకంపనలు రేపాయి. దీంతో నటుడు సూర్యను టార్గెట్‌ చేయడంతో మనస్థాపం చెందిన ఆయన భావోద్వేగ లేఖను విడుదల చేశారు.

నీట్‌ గురించి మాట్లాడే అర్హతలేదంటూ కొంతమంది చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. విద్యాభ్యాసంలో ఇబ్బందులపై మాట్లాడితే తనను టార్గెట్‌ చేయడం బాధకలిగిందని.. తన భార్య జ్యోతిక సినిమాను నిరసన కారులు అడ్డుకోవడం సరైంది కాదన్నారు. జాతీయ పౌరుడిగా తనకు మాట్లాడే అర్హత ఉందని… ప్రతి పేదవాడికి ఉన్నత విద్యను అభ్యసించే హక్కు ఉందన్నారు సూర్య.

వివరాల్లోకి వెళ్తే..  శ్రీ శివకుమార్ ఎడ్యుకేషనల్ అండ్ ఛారిటబుల్ ట్రస్ట్ / అగరం ఫౌండేషన్ యొక్క 40 వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న నటుడు సూర్య జాతీయ విద్యా విధానం 2019, రాష్ట్ర పాఠశాల విద్యార్థుల దుస్థితి, వైద్య విద్య పరీక్ష నీట్ గురించి విస్తృతంగా మాట్లాడారు. కేంద్రం ప్రవేశపెట్టిన కొత్త విద్యా విధానం  గురించి సూర్య మాట్లాడుతూ,.. “చాలా మంది విద్యార్థులు, తల్లిదండ్రులకు నూతన విధానం గురించి తెలియదు. చాలా మంది దీని గురించి మాట్లాడకపోవడం విచారకరం. అలాగే, తక్కువ ఉపాధ్యాయులున్న పాఠశాలలను మూసివేయాలని సిఫారసు చేసిన కస్తూరి రంగన్ కమిటీ నిర్ణయం సరైంది కాదని నేను భావిస్తున్నారు. ఆ పాఠశాలలు మూసివేయబడితే, గ్రామాల్లోని విద్యార్థుల దుస్థితి ఏమిటి? అందరికీ సమాన విద్యను అందించకుండా సాధారణ ప్రవేశ పరీక్షను నిర్వహించడం ఎలా న్యాయం?మౌనంగా ఉంటే, కొత్త విద్యా విధానం మనపై రుద్దబడుతోంది. ప్రతి ఒక్కరూ మేల్కొని విద్యా వ్యవస్థలో ఏమి జరుగుతుందో గ్రహించాలి… నూతన విదానంపై తమ అభిప్రాయాన్ని కలిగి ఉండాలి ” అని అన్నారు. 

ఈ సందర్భంగా సూర్య నీట్ పరీక్ష గురించి మాట్లాడారు. ఉపాధ్యాయులు లేకుండా చదువుకునే విద్యార్థులు నీట్ వంటి ప్రవేశ పరీక్షలు రాయలేరన్న ఆయన.. నీట్ కోచింగ్ సెంటర్ల ప్రస్తుత వార్షిక ఆదాయం రూ .5000 కోట్లని.. భవిష్యత్తులో,  ఆ శిక్షణా కేంద్రాలు పుట్టగొడుగుల్లాగా మొలకెత్తుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుకు సరైన సౌకర్యాలు, శిక్షణా తరగతులు ఏర్పాటు చేయకుండా ‘నీట్’ వంటి అగ్రశ్రేణి పరీక్షలను నిర్వహించడం ఎలా సమంజసం అని ప్రశ్నించారు. సూర్య చేసిన ఈ  వ్యాఖ్యలపై రాజకీయ ప్రకంపనలు రాజుకున్నాయి.