
తమిళ స్టార్ హీరో సూర్య సినిమాలకు ఉండే క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఇప్పటివరకు తమిళంలో ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులోనూ భారీ విజయాన్ని అందుకున్నాయి.అందుకే తెలుగు రాష్ట్రాల్లోనూ సూర్యకు ప్రాణమిచ్చే ఫ్యాన్స్ ఉన్నారు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే కంగువ, రెట్రో చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చిన ఈ హీరో ఇప్పుడు సరైన బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరోవైపు 50 ఏళ్ల వయసులోనూ ఫిట్నెస్ విషయంలో కుర్ర హీరోలకు షాకిస్తున్నాడు. ఇప్పటికీ చూడటానికి 30 ఏళ్ల కుర్రాడిగా కనిపిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు. రోజు రోజుకీ మరింత ఫిట్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నాడు. సూర్యతోపాటు ఆయన సతీమణి జ్యోతిక సైతం ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారన్న సంగతి తెలిసిందే. తాజాగా సూర్య తన కూతురితో కలిసి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కనిపించిన వీడియోస్, ఫోటోస్ తెగ వైరలవుతున్నాయి.
ఆ వీడియోలో సూర్య, తన కూతురు దియాతో కలిసి నడిచి వస్తున్నారు. అందులో ఇద్దరు తండ్రి కూతురిలా కాకుండా.. అన్నా చెల్లెల్లా కనిపిస్తున్నారని.. సూర్య యంగ్ లుక్ చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రస్తుతం సూర్య తన కూతురు దియాతో కలిసి వస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఇదిలా ఉంటే.. సూర్య ప్రస్తుతం డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కాగా.. తన కొత్త సినిమా కోసమే హైదరాబాద్ లో ఉన్నారు సూర్య. ఈ క్రమంలో ఇప్పుడు తన కూతురు దియాను తీసుకుని హైదరాబాద్ చేరుకున్నారు సూర్య.
ఎయిర్ పోర్టులో సింపుల్ టీషర్ట్ లో క్యాజువల్ లుక్ లో కనిపించి అభిమానులను ఆశ్చర్యపరిచారు సూర్య. ఇదిలా ఉంటే.. సూర్య డాటర్ దియా సోషల్ మీడియాకు చాలా దూరంగా ఉంటుంది. అలాగే ఎప్పుడూ సినిమా ఈవెంట్లలో కనిపించదు. ఇటీవలే తన గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసింది. తమ కూతురి ఫోటోస్ అప్పుడప్పుడు హీరోయిన్ జ్యోతిక పంచుకుంటారు.
Exclusive @Suriya_offl ❤️ #Suriya46 pic.twitter.com/3a5nMaE9Au
— Suriya Fanatics Kerala ™ (@TeamSFK__Offl) June 8, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..
Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..
Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..