నోటి దురుసు.. స్టార్ సింగర్ అయితే సరిపోదు.. సభ్యత ఉండాలి?
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేది సామెతను ఎప్పుడూ క్రాస్ చేస్తుంటారు బాలీవుడ్ సెలబ్రిటీలు. ఇప్పుడు అదే బాలీవుడ్‌లో స్టార్ ర్యాపర్‌గా వెలుగొందుతున్న బాద్షా తన నోటికి పనిచెప్పాడు.మరో లేడీ సింగర్‌పై నోరుపారేసుకున్నాడు. పిచ్చి వాగుడు వాగాడు. తన వాగుడుతో ఇప్పుడు విమర్శిల పాలవుతున్నాడు.
ర్యాప్ సింగర్ బాద్షా..! ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ బాలీవుడ్ లో మాత్రం ఈయన చాలా ఫేమస్. అక్కడ ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ పాడారు ఆయన. సింగర్ బాద్షా పలు టీవీషోల్లో జడ్జ్ గాను వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ స్టార్ సింగర్ ఇంగ్లీష్, అల్బేనియన్ సింగర్ దువా లిపా పై షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఈ కామెంట్సే ఇప్పుడు వివాదంగా మారాయి. సింగర్ బాద్షా పై విమర్శలు కురిపిస్తున్నాయి. ఇంతకూ ఈ స్టార్ ర్యాపర్ ఏమన్నాడంటే ఇంటర్నేషనల్ స్టార్ సింగర్ దువా లిపాతో.. పాట పాడటం కాదు కానీ.. పిల్లలను కంటా అంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. అయితే ఈ స్టార్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వివాదాస్పద మయ్యాయి. కొంత మంది నెటిజన్స్ ఈయన చేసిన కామెంట్‌ను తప్పుబడుతున్నారు. నోటి దూల అంటే ఇదే అంటూ విమర్శిస్తున్నారు. స్టార్ సింగర్ అయితే సరిపోదు సభ్యత ఉండాలంటూ తిడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ప్రేమగా స్వీట్ పెడితే నిరాకరించిన వధువు.. వరుడు ఏం చేశాడో చూడండి

ఒకే ఒక్క క్లూతో ట్రావెల్ బ్యాగులో డెడ్‌బాడీ మిస్టరీ వీడింది వీడియ

రైతు వేషంలో పోలీసులు.. తర్వాత ఏమైదంటే? వీడియో

వార్నీ.. ఇదేం బిజినెస్ రా అయ్యా వీడియో

దృశ్యం సినిమాను తలపించేలా వరుస చోరీలు వీడియో

వామ్మో .. ఎంత పని చేసిందీ కోతి.. రూ. 20 లక్షల విలువైన పర్సు చోరీ

కడుపునొప్పితో ఆస్పత్రికి మహిళ.. టెస్టులు చేయగా..

చేపలు వేటకు వెళ్లిన జాలర్లు.. సముద్రంలో తెలియాడుతున్నది చూసి
