‘ప్రేమే పొట్టన పెట్టుకుంది’ పాపం! హీరోయిన్ వెలుగొందాల్సింది.. శవమై కనిపించింది
గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ప్రముఖ మోడల్ ఆత్మహత్య చేసుకుంది. ఇరవై మూడేళ్ల అంజలి వర్మోరా తన ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో ఇది ఆత్మహత్య అని తేలింది. మానసిక ఒత్తిడి కారణంగానే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని పోలీసులు చెబుతున్నారు.
ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత అంజలి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అయితే అంజలి ఇంట్లో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదు. అంజలి మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు పోలీసులకు సమాచారం అయితే అందింది. ఈ ఘటనలో కేసు నమోదు చేసుకున్న పోలీసులు అంజలి ఫోన్ రికార్డులను పరిశీలిస్తున్నారు. బంధువుల నుంచి స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. ఇక అంజలి వెర్మోరా చాలా ఏళ్లుగా మోడలింగ్ చేస్తోంది. సినిమాల్లో హీరోయిన్ గా వెలుగొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈక్రమంలోనే సోషల్ మీడియాలోనూ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో అంజలిని చాలా మంది ఫాలో అవుతున్నారు. అయితే అంజలి గత కొన్ని రోజులుగా డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. దీనికి ప్రేమ వ్యవహారమే కారణమని తెలుస్తోంది. అందుకు తగ్గట్టుగానే ఆమె గత కొన్ని రోజులుగా ఎమోషనల్ పోస్టులు షేర్ చేస్తోంది. రీసెంట్‌గా ఆమె ‘నీకు నేను ఏమీ కానని ఈ రోజే తెలిసింది’ అంటూ ఓ పోస్టు పెట్టింది. మరో పోస్టులో .. ‘మనం అన్నీ కోల్పోయినా అది పెద్ద మ్యాటర్ కాదు. కానీ, ప్రేమను కోల్పోతే మాత్రం అది చాలా బాధిస్తుంది’ అంటూ ఎమోషనల్ గా రాసుకొచ్చింది. అయితే పోలీసులు అంజలి బాయ్ ఫ్రెండ్ కోసం గాలింపు చేపట్టారు. అతను దొరికితే అంజలి ఆత్మహత్యకు సంబంధించి మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు భావిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
నోటి దురుసు.. స్టార్ సింగర్ అయితే సరిపోదు.. సభ్యత ఉండాలి?
ప్రేమగా స్వీట్ పెడితే నిరాకరించిన వధువు.. వరుడు ఏం చేశాడో చూడండి
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్

