Miracle movie: సునీల్ స్థానంలో 90స్ హీరో.. మిరాకిల్ మూవీతో రీఎంట్రీ.. కారణం ఏంటంటే…

మిరాకిల్ అనే చిత్రం నుంచి సునీల్ అనూహ్యంగా తప్పుకున్నారు. ఆయన స్థానంలో అనూహ్యంగా 90స్ లో మనందరినీ అలరించిన ఓ స్మార్ట్ హీరో తెరపైకి వచ్చారు. ఆ హీరో ఎవరు, సునీల్ తప్పుకోవడానికి కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సంక్రాంతి పండక్కి ఈ సినిమా నుంచి ఆసక్తికర అప్డేట్ ఇవ్వనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

Miracle movie: సునీల్ స్థానంలో 90స్ హీరో.. మిరాకిల్ మూవీతో రీఎంట్రీ.. కారణం ఏంటంటే...
Miracle

Updated on: Jan 14, 2026 | 9:14 PM

సంక్రాంతి పండక్కి సినీప్రియులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు దర్శకుడు ప్రభాస్ నిమ్మల. ఆయన తెరకెక్కిస్తున్న సినిమా మిరాకిల్. ఈ చిత్రాన్ని సైదా ఫామిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రమేష్ ఇగ్గిడి, చందర్ గౌడ్ ప్రొడ్యూసర్స్ గా నిర్మిస్తున్నారు. సత్య గ్యాంగ్, ఫైటర్ శివ చిత్రాల దర్శకుడు ప్రభాస్ నిమ్మల దర్శకత్వంలో మిరాకిల్ చిత్రం ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. దర్శకుడు ప్రభాస్ నిమ్మల మాట్లాడుతూ ఈ చిత్రం ఒక యునిక్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు రాని కథ తో చేస్తున్నట్టు దర్శకుడు తెలిపాడు. అయితే ఈ చిత్రంలో ముందుగా ఇద్దరు హీరోల్లో ఒకరుగా సునీల్ ను ఫిక్స్ చేశారు. అయితే సునీల్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో అనుకున్న విధంగా డేట్స్ అడ్జెస్ట్ కాలేదట. అందుకే ఆయన స్థానంలో 90స్ హీరో రోజాపూలు ఫేమ్ శ్రీరామ్ ను ఫిక్స్ చేశారు. 21 నుంచి జరగబోయే రెండో షెడ్యూల్ లో శ్రీరామ్ మీద కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఇవి కూడా చదవండి : Actor Balaji: రఘువరన్ చనిపోవడానికి కారణం అదే.. ఆయన కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడంటే.. నటుడు బాలాజీ..

ఈ చిత్రంలో కథానాయకుడుగా రణధీర్ భీసు, కథానాయకులుగా హెబ్బా పటేల్, ఆకాంక్షలు చేస్తున్నట్టు దర్శకుడు తెలిపారు. ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ గా మరో హీరో శ్రీ రామ్, మరో ముఖ్య పాత్రలో సీనియర్ యాక్టర్ సురేష్ , విలన్ గా నూతన నటుడు నాయుడు , జన కొల్లి ,యోగి కాత్రే , విజయ్ సూర్య, ఇంతియాజ్ , సాయి బాబా,దిల్ రమేష్, జాన్సీ , సూర్య నారాయణ, శ్రీదర్ , శ్రీకాంత్, శివ, ఆమని, హైమావతి, బెజవాడ మస్తాన్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నట్టు మూవీ టీం తెలిపింది. ఈ చిత్రానికి కెమెరా సురేందర్ రెడ్డి, ఎడిటింగ్ విశ్వనాథ్, మ్యూజిక్ – ప్రభాస్, లిరిక్స్ – రాంబాబు గోశాల, ఫైట్స్ – శ్రీను చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

ఇవి కూడా చదవండి : Soundarya : చనిపోవడానికి ముందు నాతో ఫోన్ మాట్లాడింది.. అసలు విషయం బయటపెట్టిన డైరెక్టర్..

ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను జనవరి 16న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించి, పండుగ జోష్‌ను మరింత పెంచింది చిత్రయూనిట్. ఈ చిత్రంపై ఇండస్ట్రీలో ఇప్పటికే పాజిటివ్ వైబ్స్ మొదలయ్యాయి. ఈసారి యాక్షన్‌కు ఫ్యామిలీ ఎమోషన్స్‌ను మేళవించి ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.

ఇవి కూడా చదవండి : Anshu Ambani : ఏంటీ.. మన్మథుడు హీరోయిన్‏కు ఇంత పెద్ద కూతురు ఉందా.. ? అందంలో తల్లిని మించిపోయిందిగా..