Sonu Sood: సంపాదన కంటే సాయం చేయడంలోనే సంతృప్తి.. త్వరలో అనాథల కోసం ఆశ్రమం నిర్మిస్తానన్న కలియుగ కర్ణుడు
Sonu Sood: సోనూ సూద్ పరిచయం చేయాల్సిన పనిలేని పేరు. నటుడిగానే కాదు.. మంచితనం, మానవత్వం ఉన్న మనిషిగా కూడా కీర్తింపబడుతున్నాడు. కరోనా (Corona Virus) వెలుగులోకి వచ్చినప్పుడు..
Sonu Sood: సోనూ సూద్ పరిచయం చేయాల్సిన పనిలేని పేరు. నటుడిగానే కాదు.. మంచితనం, మానవత్వం ఉన్న మనిషిగా కూడా కీర్తింపబడుతున్నాడు. కరోనా (Corona Virus) వెలుగులోకి వచ్చినప్పుడు లాక్ డౌన్(Lock Down) సమయంలో నేను ఉన్నానంటూ.. బాధితులకు అండగా.. మొదలు పెట్టిన సేవా కార్యక్రమాలను ఇంకా కొనసాగిస్తూనే ఉన్నాడు. తనను ఎవరైనా సరే.. సాయం కోరగానే నేను ఉన్నానంటూ అండగా నిలబడుతున్నాడీ కలియుగ దానకర్ణుడు.. తాను సంపాదించిన దానిలో ఎంతో కొంత సమాజానికి తిరిగి ఇవ్వాలని భావించాడమే కాదు.. తనకు తోచిన రీతిలో సేవాకార్యక్రమాలు చేస్తూనే ఉన్నాడు. సోనూ సూద్ తాజాగా మరో అడుగు ముందుకు వేసి.. త్వరలో వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించనున్నానని ప్రకటించాడు. వివరాల్లోకి వెళ్తే..
సినీ నటుడు సోనూ సూద్ మహారాష్ట్రలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం షిర్డీ సాయి బాబాను బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సోనూ మాట్లాడుతూ.. తాను కన్న కలను నెరవేర్చుకోవడానికి షిరిడీకి వచ్చినట్లు తెలిపాడు. తాను ఇక్కడ వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిరించనున్నట్లు ప్రకటించాడు. తన కల త్వరగా నెరవేరేలా చూడమని షిర్డీ సాయిని ప్రార్ధించానని తెలిపారు సోనూ.
తనకు సినిమా ద్వారా కోట్లు ఆదాయం వచ్చిన రాని ఆనందం.. తోటివారికి సాయం చేస్తే కలుగుతుందని అన్నారు. అంతేకాదు భాషగురించి మాట్లాడుతూ.. మానవత్వానికి మించిన భాషలేదన్నారు. తాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మరాఠీ ఇలా అనేక భాషా సినిమాల్లోనే కాదు చైనా సినిమాల్లో కూడా నటించానని… కళాకారుడికి భాషతో పనిలేదని అన్నారు. తానూ ఏ భాషలో పనిచేస్తే.. అదే తన భాష అనిపిస్తోందన్నారు సోను. అయితే అన్ని భాషలకంటే మానవత్వమే గొప్ప భాషాని.. ఈ విషయం తనకు కరోనా నేర్పించిందని అన్నారు.
View this post on Instagram
తల్లి దండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటి నుంచి తోటివారి సాయం చేయడం గురించి చెప్పాలని.. స్కూల్స్ లో కూడా నేర్పించాలని సూచించారు. డబ్బులు సంపాదించడం.. తోటివారికి సాయం చేయడం వంటి సంకల్పం ఉండాలని చెప్పారు సోనూ. అంతేకాదు షిర్డీలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ సందడి చేశారు. చెరకు రసం తీసిన వీడియో స్వయంగా ట్విట్టర్ లో షేర్ చేశారు.
Black Hole Week: బ్లాక్‌హోల్ నుంచి వింత శబ్దాలు.. బాబోయ్ హార్రర్ మూవీ మ్యూజిక్ అంటున్న నెటిజన్లు