Tollywood: సినిమా సూపర్ హిట్.. బంగారు విగ్రహంగా మారిన హీరో.. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ?.

ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన “మావీరన్” చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమా శుక్రవారం ఉదయం నుంచి విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ కలెక్షన్ల పరంగా ఎన్నో విజయాలు సాధిస్తోంది. శివకార్తికేయన్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ ఇదే అని.. చాలా బాగుందని అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Tollywood: సినిమా సూపర్ హిట్.. బంగారు విగ్రహంగా మారిన హీరో.. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా ?.
Actor

Updated on: Jul 15, 2023 | 9:39 PM

తమిళ్ స్టార్ హీరో శివకార్తికేయన్ కు తెలుగులోనూ మంచి పాలోయింగ్ ఉంది. ఇటీవలే ప్రిన్స్ సినిమాతో నేరుగు టాలీవుడ్ ప్రేక్షకులను అలరించాడు ఈ హీరో. అయితే ఈ మూవీ ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ తర్వాత ఆయన తమిళంలో వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రధాన పాత్రలో నటించిన “మావీరన్” చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైంది. ఈ సినిమా శుక్రవారం ఉదయం నుంచి విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ కలెక్షన్ల పరంగా ఎన్నో విజయాలు సాధిస్తోంది. శివకార్తికేయన్ ఇప్పటివరకు చేసిన సినిమాల్లో ది బెస్ట్ మూవీ ఇదే అని.. చాలా బాగుందని అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇక భారీ అంచనాల మధ్య విడుదలై మావీరన్ మూవీ సూపర్ హిట్ కావడంతో చిత్రబృందం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమాలో శివకార్తికేయన్ స్టైల్, లుక్ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అతను తన చేతులతో ఇచ్చిన పోజ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. చాలా మంది దీన్ని రీ-క్రియేట్ చేసి తమ సోషల్ నెట్‌వర్క్‌లలో పోస్ట్ చేస్తున్నారు.

ఇదిలా ఉంటే.. శివకార్తికేయన్ స్టైల్ ను ప్రమోట్ చేయడానికి చిత్ర నిర్మాణ సంస్థ శాంతి టాకీస్ బంగారు విగ్రహం రూపంలో శివకార్తికేయన్ హ్యాండ్స్ ఫోజును రూపొందించింది. ప్రస్తుతం ఈ ఐడల్ నెట్టింట వైరలవుతుంది. శివకార్తియన్ స్టైల్ కు సంబంధించిన విగ్రహాలను చిన్నపిల్లలు, యువత ఎంజాయ్ చేసి కొనుక్కుంటున్నారని చిత్రయూనిట్ తెలియజేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.