Sai Pallavi: సాయి పల్లవి అలా పిలవడంతో ఫీలయ్యాను.. హీరో శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

|

Oct 19, 2024 | 9:36 PM

కోలీవుడ్ హీరో శివకార్తికేయన్ కు తమిళంతోపాటు తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. రమో సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత శివకార్తికేయన్ నటించిన అనేక చిత్రాలు తెలుగులోనూ రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం అమరన్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సాయి పల్లవి హీరోయిన్.

Sai Pallavi: సాయి పల్లవి అలా పిలవడంతో ఫీలయ్యాను.. హీరో శివకార్తికేయన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Sai Pallavi, Sivakarthikeya
Follow us on

కోలీవుడ్ స్టార్ హీరో శివ కార్తికేయన్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న సినిమా అమరన్. బయోగ్రాఫికల్ యాక్షన్ ఫిల్మ్‏గా వస్తోన్న ఈ సినిమాకు రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా.. అక్టోబర్ 31న ఈ సినిమా విడుదల కానుంది. దీపావళి కానుకగా తమిళంతోపాటు తెలుగులోనూ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, టీజర్ ఆకట్టుకున్నాయి. ఆర్మీ అధికారి మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో ముకుంద్ పాత్రలో శివకార్తికేయన్ నటిస్తున్నారు. తాజాగా చెన్నై వేదికగా ఈ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో శివకార్తికేయన్ మాట్లాడుతూ సాయి పల్లవి గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

శివకార్తికేయన్ మాట్లాడుతూ.. “మేజర్ ముకుంద్ వరదరాజన్ గురించి మొదట్లో వార్తలలో విన్నాను. డైరెక్టర్ రాజ్ కుమార్ ఈ కథను వివరించినప్పుడు ఎమోషనల్ అయ్యాను. ముకుంద్ గొప్ప లీడర్. కశ్మీర్ లో 100 రోజుల పాటు యాక్షన్ సన్నీవేశాలను చిత్రీకరించాం. ఈ సినిమాలోని క్లైమాక్స్ అందరినీ కంటతడి పెట్టిస్తుంది. ముకుంద్ అందమైన జీవితాన్ని.. ఆయన కుటుంబాన్ని అందరూ గౌరవించేలా తీర్చిదిద్దాం. ఈ సినిమా కోసం ఆయన కుటుంబాన్ని సంప్రదించినప్పుడు ఓ తమిళ హీరోనే ఇందులో నటించాలని అన్నారట. ఎందుకంటే ముకుంద్ కు తమిళ సినీ పరిశ్రమ అంటే చాలా ఇష్టం” అని అన్నారు.

ఇక సాయి పల్లవి గురించి మాట్లాడుతూ.. “నేను ఓ టీవీ ఛానల్లో పనిచేస్తున్నప్పుడు సాయి పల్లవిని మొదటిసారి కలిశాను. నేను హోస్టింగ్ చేసిన ఓ షోకు ఆమె వచ్చింది. ఇండస్ట్రీలో ఆమె పేరే ఓ బ్రాండ్. ప్రేమమ్ సినిమాలో ఆమె యాక్టింగ్ చూసి ఆశ్చర్యపోయాను. ఫోన్ చేసి ప్రశంసించాను. వెంటనే ఆమె థాంక్యూ అన్నా అని చెప్పింది. నన్ను అన్నా అని పిలిచినందుకు అప్పుడు చాలా ఫీలయ్యాను” అంటూ చెప్పుకొచ్చారు.

 

ఇది చదవండి :

Bhadra Movie: వార్నీ.. ఏం ఛేంజ్ భయ్యా..’భద్ర’ మూవీలో రవితేజ మరదలు.. ఇప్పుడు చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే..

Actress Laya: అందంలో అమ్మను మించిపోయిన డాటర్.. హీరోయిన్ లయ కూతురిని చూశారా..?

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.