ఇద్దరి మధ్య గొడవలు.. విడాకులు తీసుకోవాలనుకున్న శివ బాలాజీ, మధుమిత కానీ..

హీరోగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత సెకండ్ హీరోగా మారాడు నటుడు శివబాలాజీ. కెరీర్ బిగినింగ్ లో హీరోగా ఆకట్టుకున్న శివబాలాజీ హీరోగా సక్సెస్ కాలేకపోయారు. మంచి సినిమాలు పడ్డప్పటికీ ఆయన హీరోగా ఎక్కువ కాలం రాణించలేకపోయారు. ఆతర్వాత సెకండ్ హీరోగా నటించారు. ముఖ్యంగా ఆర్య, శంభో శివ శంభో సినిమాల్లో తన నటనతో ఆకట్టుకున్నారు.

ఇద్దరి మధ్య గొడవలు.. విడాకులు తీసుకోవాలనుకున్న శివ బాలాజీ, మధుమిత కానీ..
Siva Balaji, Madhumitha

Updated on: Jan 17, 2026 | 12:07 PM

హీరోగా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత షయకపాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు నటుడు శివ బాలాజీ. ఎన్నో సినిమాల్లో ఆయన నటించి మెప్పించాడు. హీరోగా ఒకటి రెండు సినిమాల్లో నటించనప్పటికీ అంతగా గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు. అదే సమయంలో అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ఆర్య సినిమా శివ బాలాజీకి మంచి విజయంతో పాటు గుర్తింపును తెచ్చిపెట్టింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేశాడు. శంభో శివ శంభో అనే సినిమాతో ఆకట్టుకున్నాడు. ఇటీవలే కన్నప్ప సినిమాలో నటించి ఆకట్టుకున్నాడు శివ బాలాజీ. శివాజీ సతీమణి మధుమిత కూడా సినీ నటే.. పలు సినిమాల్లో ఆమె నటించింది. తాజాగా ఈ జంట ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.

అతనంటే నాకు పిచ్చి.. నా గది నిండా ఆ హీరో ఫొటోలే : ఫోక్ డాన్సర్ నాగ దుర్గ

ఈ ఇంటర్వ్యూలో తమ పెళ్లి గురించి అనేక విషయాలను పంచుకున్నారు. మధుమిత, శివ బాలాజీల ప్రేమ కథలో చాలా ట్విస్ట్ లు ఉన్నాయట. వారి ప్రేమ పెళ్లికి మొదట్లో మధుమిత కుటుంబం నుండి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ఇంట్లో ఆమెను గదిలో బంధించి, ఫోన్ తీసేసుకున్నారట. మధుమిత తండ్రి లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ, ఆమె తల్లికి మాత్రం వారి పెళ్లి ఇష్టంలేదట. మధుమిత మూడు రోజుల నిరాహార దీక్ష చేసిన తర్వాత.. మధుమిత తండ్రి జోక్యం చేసుకుని తల్లిని ఒప్పించడంతో వివాహం జరిగిందని మధుమిత తెలిపింది.

ఆ ముద్దుగుమ్మకు పోటీ లేదు.. స్టార్ హీరోయిన్స్ కూడా ఆవిడనే ఫాలో అయ్యేవారన్న బాలయ్య

పెళ్లైన తర్వాత మొదటి ఒకటిన్నర సంవత్సరం వారి బంధం దాదాపు విడిపోయే దశకు చేరుకుందట. అప్పటికే వారికి బాబు కూడా పుట్టాడు. వారిద్దరి మధ్య కొన్ని మనస్పర్థలు వచ్చాయట..  బయటి వ్యక్తులను వివాదాలలోకి లాగడం గొడవలకు దారితీసింది. గొడవలు ఎక్కువకావడంతో ఒక కజిన్ ఇచ్చిన సలహా మేరకు కొన్ని రోజులు విడివిడిగా ఉన్నారట.. చివరిగా ఇగో సమస్యలను పక్కనపెట్టి, నేరుగా మాట్లాడుకోవడం ద్వారా తమ సమస్యలను పరిష్కరించుకున్నాం.. అని చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

అతను నా సినిమాలు చూడడు.. కానీ నన్ను ఓ జంతువులా చూస్తాడు.. అసలు విషయం చెప్పిన ఆర్జీవీ

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..