Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Siddharth: ‘ఆ విషయంలో క్షమాపణలు అవసరం లేదు’.. బెంగుళూరు ప్రెస్ మీట్ ఘటనపై సిద్ధార్థ్ రియాక్షన్..

తమిళనాడుకు కావేరీ నీటి విడుదలపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తమిళ సినిమాలను నిషేధించాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే సిద్ధార్థ్‌ నటించిన చిన్నా సినిమా ప్రమోషన్లలో భాగంగా బెంగుళూరులోని ఎస్‌ఆర్‌వీ థియేటర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడే సిద్ధార్థ్ నటించి, నిర్మించిన ‘చిన్నా’ సినిమా ప్రదర్శన కూడా జరిగింది. అయితే కన్నడ అనుకూల కార్యకర్తలు విలేకరుల సమావేశాన్ని అడ్డుకున్నారు.

Siddharth: 'ఆ విషయంలో క్షమాపణలు అవసరం లేదు'.. బెంగుళూరు ప్రెస్ మీట్ ఘటనపై సిద్ధార్థ్ రియాక్షన్..
Siddharth
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 06, 2023 | 9:55 PM

కొద్ది రోజుల క్రితం తమిళ్ హీరో సిద్ధార్థ్‏కు బెంగళూరులో చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. ఆయన నటించిన్న చిన్నా సినిమా ప్రమోషన్లలో భాగంగా బెంగుళూరులో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. అదే సమయంలో అక్కడకు వచ్చిన కొన్ని కన్నడ అనుకూల సంస్థలు ఆయన విలేకరుల సమావేశాన్ని అడ్డుకున్నాయి. కావేరీ నది జలాల వివాదం జరుగుతున్నందున ఒక తమిళ్ హీరో కర్ణాటకలో ప్రమోషన్స్ చేయవద్దని డిమాండ్ చేశారు. దీంతో సిద్ధార్థ్ విలేకరుల సమావేశం నుంచి అర్ధాంతరంగా బయటకు వెళ్లిపోయారు. సిద్ధార్థ్‏కు ఎదురైన పరిస్థితిపై కన్నడ నటుడు ప్రకాష్ రాజ్, శివ రాజ్ కుమార్ స్పందిస్తూ సిద్ధార్థ్‌కు క్షమాపణలు చెప్పారు. తాజాగా దీనిపై సిద్ధార్థ్ మాట్లాడుతూ.. తనకు క్షమాపణలు అవసరం లేదని అన్నారు.

తమిళనాడుకు కావేరీ నీటి విడుదలపై పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. తమిళ సినిమాలను నిషేధించాలనే డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే సిద్ధార్థ్‌ నటించిన చిన్నా సినిమా ప్రమోషన్లలో భాగంగా బెంగుళూరులోని ఎస్‌ఆర్‌వీ థియేటర్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడే సిద్ధార్థ్ నటించి, నిర్మించిన ‘చిన్నా’ సినిమా ప్రదర్శన కూడా జరిగింది. అయితే కన్నడ అనుకూల కార్యకర్తలు విలేకరుల సమావేశాన్ని అడ్డుకున్నారు. దీంతో సిద్ధార్థ్ సగంలోనే బయటకు వెళ్లిపోయాడు. ఈ ఘటనను ప్రకాష్‌రాజ్‌, శివరాజ్‌కుమార్‌ ఖండించారు. ప్రకాష్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ సిద్ధార్థ్ కు క్షమాపణలు తెలిపారు. అలాగే నటుడు శివరాజ్‌కుమార్ ఖండిస్తూ.. కన్నడిగుల తరపున క్షమాపణలు చెప్పారు.

సిద్ధార్థ్ మాట్లాడుతూ.. ‘శివరాజ్‌కుమార్‌, ప్రకాష్‌రాజ్‌ల క్షమాపణలను అంగీకరించలేను. ఎందుకంటే అందులో వారి తప్పు లేదు. అందుకు మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. కానీ మీరు క్షమాపణలు చెప్పడం మీ పెద్ద మనసులను తెలియజేస్తుంది. నాపై మీరు చూపించే ప్రేమ పట్ల మీ ఇద్దరికి నా కృతజ్ఞతలు’’ అని సిద్ధార్థ్ అన్నారు. చిన్నా ప్రదర్శన సందర్భంగా కర్ణాటకలో బంద్‌ ఉందంటూ కొందరు ప్రచారం చేశారు. దీనిపై ఆయన క్లారిటీ ఇచ్చారు. ఆ సినిమా విడుదలైనప్పుడు బంద్ జరగలేదని సిద్ధార్థ్ అన్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గోల్డ్ బాండ్స్ ఉన్న వారికి ఆర్‌బీఐ అలెర్ట్..!
గోల్డ్ బాండ్స్ ఉన్న వారికి ఆర్‌బీఐ అలెర్ట్..!
అజితే కాదు ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా కార్ రేసరే.. ఎవరంటే?
అజితే కాదు ఈ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ కూడా కార్ రేసరే.. ఎవరంటే?
ఏసీ ఎంత వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలంటే.. ఇలా చేయండి
ఏసీ ఎంత వాడినా కరెంటు బిల్లు తక్కువ రావాలంటే.. ఇలా చేయండి
ధన సంపాదన విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..!
ధన సంపాదన విషయంలో ఈ తప్పులు అస్సలు చేయకండి..!
వామ్మో.! ఇదేం పామురా.. జెట్‌స్పీడ్‌గా చెట్టెక్కేసింది..
వామ్మో.! ఇదేం పామురా.. జెట్‌స్పీడ్‌గా చెట్టెక్కేసింది..
GT vs PBKS: పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు శుభ్మన్ షాకింగ్ కామెంట్స్
GT vs PBKS: పంజాబ్‌తో మ్యాచ్‌కు ముందు శుభ్మన్ షాకింగ్ కామెంట్స్
స్టేజ్ పైనే పరువు తీసిన ఫ్యాన్స్.. దెబ్బకు బోరున ఏడ్చిన సింగర్..
స్టేజ్ పైనే పరువు తీసిన ఫ్యాన్స్.. దెబ్బకు బోరున ఏడ్చిన సింగర్..
ఓరీ దేవుడో ఇదేం పెళ్లాంరా బాబోయ్.. మొగుడిపై కోపంతో ఏం చేసిందంటే..
ఓరీ దేవుడో ఇదేం పెళ్లాంరా బాబోయ్.. మొగుడిపై కోపంతో ఏం చేసిందంటే..
ఆయుర్వేదం, వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటులో పతంజలి కీలక పాత్ర ఏంటి?
ఆయుర్వేదం, వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటులో పతంజలి కీలక పాత్ర ఏంటి?
హాట్ సమ్మర్‌లో కూల్ కూల్..తక్కువ ధరలో బెస్ట్ ఏసీలు ఇవే..!
హాట్ సమ్మర్‌లో కూల్ కూల్..తక్కువ ధరలో బెస్ట్ ఏసీలు ఇవే..!