Oke Oka Jeevitham Teaser: ఆకట్టుకుంటున్న ఒకే ఒక జీవితం టీజర్.. శర్వానంద్ లుక్ అదిరిపోయిందిగా..

|

Dec 29, 2021 | 7:05 PM

టాలెంటెడ్ హీరో శర్వానంద్ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఈ యంగ్ హీరో

Oke Oka Jeevitham Teaser: ఆకట్టుకుంటున్న ఒకే ఒక జీవితం టీజర్.. శర్వానంద్ లుక్ అదిరిపోయిందిగా..
Oke Oka Jeevitham
Follow us on

టాలెంటెడ్ హీరో శర్వానంద్ హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఈ యంగ్ హీరో మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు శర్వానంద్. మహా సముద్రంపై హీరో శర్వానంద్ భారీ అంచనాలనే పెట్టుకున్నారు. సినిమా రిలీజ్ ముందు ప్రమోషన్స్ కూడా ఒక రేంజ్ లో చేశారు. అయితే ఈ సినిమా ఆశించినంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ హీరో ఒకే ఒక జీవితం, ఆడాళ్లు మీకు జోహర్లు సినిమాలు చేస్తున్నాడు. ఇందులో ఒకే ఒక జీవితం సినిమాను డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తుండగా.. రీతూ వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే ఇందులో కీలక పాత్రలో అమల నటిస్తుంది.

తాజాగా ఈ సినిమా టీజర్‏ను తమిళ్ స్టార్ హీరో సూర్య విడుదల చేస్తూ చిత్రయూనిట్‍కు శుభాకాంక్షలు తెలిపారు.. టైమ్ మెషీన్ కాన్సెప్ట్‏తో ఈ మూవీ తెరకెక్కినట్టుగా టీజర్ చూస్తే తెలుస్తోంది. స్నేహితులైన శర్వానంద్, ప్రియదర్శి, వెన్నెల కిశోర్ భవిష్యత్తు నుంచి వర్తమానంలోకి రావడం సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. తల్లీ కొడుకుల అనుబంధం అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా కనిపిస్తోంది. ఇందులో శర్వానంద్ క్యూట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాను ఎస్ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ఆర్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: Harnaaz sandhu: నాకు ఆ నటినే ఇన్‌స్పిరేషన్‌.. అవకాశం వస్తే ఆమె బయోపిక్‌లో నటించాలనుకుంటున్నా.. మిస్‌ యూనివర్స్‌ ఇంట్రెస్టింగ్‌ కామెంట్స్‌..

Roja Selvamani: నాని సినిమాలు చేయడం వేస్ట్.. కిరాణా కొట్టు పెట్టుకోవడమే బెటర్.. ఎమ్మెల్యే రోజా ఫైర్..

Manchu Manoj COVID-19 Positive: టాలీవుడ్‌లో మళ్లీ మహమ్మారి కలకలం.. కుర్ర హీరోకు కరోనా పాజిటివ్