జనసేనానితో ప్రయాణం.. శర్వా సర్‌ప్రైజ్!

యంగ్ హీరో శర్వానంద్ తన తాజా చిత్రం  ‘రణరంగం’పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఆయన సినిమాని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే శర్వాకి టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాని సర్ఫ్రైజ్‌కి గురిచేశారు. కాకినాడ వెళ్తున్న యంగ్ హీరోకు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో పవన్ కన్పించడంతో సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘రణరంగం ట్రైలర్ లాంచ్ కోసం కాకినాడ వెళ్తుండగా అదృష్ణవశాత్తు మన పవర్ స్టార్‌ను కలిశా’’ అని శర్వా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. కాగా, […]

జనసేనానితో ప్రయాణం.. శర్వా సర్‌ప్రైజ్!

Edited By:

Updated on: Aug 04, 2019 | 4:56 PM

యంగ్ హీరో శర్వానంద్ తన తాజా చిత్రం  ‘రణరంగం’పై మంచి అంచనాలు పెట్టుకున్నారు. తాజాగా ఆయన సినిమాని ప్రమోట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు. అయితే శర్వాకి టాలీవుడ్ పవర్ స్టార్, జనసేనాని సర్ఫ్రైజ్‌కి గురిచేశారు. కాకినాడ వెళ్తున్న యంగ్ హీరోకు రాజమండ్రి ఎయిర్‌పోర్ట్‌లో పవన్ కన్పించడంతో సెల్ఫీ దిగి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు. ‘‘రణరంగం ట్రైలర్ లాంచ్ కోసం కాకినాడ వెళ్తుండగా అదృష్ణవశాత్తు మన పవర్ స్టార్‌ను కలిశా’’ అని శర్వా ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు.

కాగా, పవన్ కళ్యాణ్ ఆదివారం భీమవరం పర్యటనకు వెళ్లారు. హైదరాబాద్ నుంచి విమానంలో రాజమండ్రి వెళ్లిన పవన్ అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భీమవరం వెళ్లారు. అయితే, రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్ దిగిన సమయంలో శర్వానంద్ కూడా అక్కడికి చేరుకున్నారు. ఈ సమయంలో పవన్‌ను శర్వా కలిశారు.

ఇదిలా ఉంటే, ఆదివారం సాయంత్రం కాకినాడలో జరగనున్న ‘రణరంగం’ ట్రైలర్ లాంచ్ వేడుకకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.