
తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవిది ఒక ప్రత్యేక స్థానం. ఎన్టీఆర్, ఏఎన్నార్ ల తర్వాత అంతటి స్థాయిలో అభిమానులను సంపాదించుకున్న నటుడాయన. సినిమా ఇండస్ట్రీలో స్వయంకృషితో ఎదిగిన మెగాస్టార్ కు కష్టంవిలువ బాగా తెలుసు. అందుకే సినిమాల్లోకి రావాలనుకునే వారికి తన వంతు సహాయం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు సయాజీ షిండే కెరీర్‌కి కూడా చిరంజీవి హెల్ప్ చేశారట. ఈ విషయాన్ని సయాజీ షిండేనే చెప్పుకొచ్చారు. వివరాల్లోకి వెళితే మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ చిత్రంలో సయాజీ షిండే విలన్ గా నటించాడు. ఆయనకు ఇదే మొదటి సినిమా. అయితే సయాజీది నార్త్ ఇండియా కావడంతో తెలుగు రాదు. దీంతో ఠాగూర్ సినిమా సెట్ లో చాలా ఇబ్బంది పడ్డారట. ఇది గమనించిన చిరంజీవి ఆయనను దగ్గరికి పిలిచారట. దేని గురించైనా కంగారు పడుతున్నావా? అని అడిగార. దీనికి ‘ అవును సార్.. నేను రంగ స్థలం నటుడిని. డైలాగ్ అర్థం కాకపోతే ముఖంలో భావోద్వేగాలను పలికించలేను. చాలా ఇబ్బందిగా ఉంది’ అని సయాజీ షిండే చెప్పారట.
షాయాజీ షిండే నార్త్ ఇండియన్ కాబట్టి తెలుగు రాదు. దీనితో ఠాగూర్ చిత్రంలో చాలా ఇబ్బంది పడుతూ కనిపించారట. చిరంజీవి షాయాజీ షిండే టెన్షన్ పడుతుంటే గమనించి పిలిపించారు. దేనిగురించైనా కంగారు పడుతున్నారా అని అడిగారు. అవును సర్ కంగారుగానే ఉంది. నేను రంగస్థలం నటుడిని. డైలాగ్ నాకు అర్థం కాకపోతే ఫేస్ లో ఎక్స్ ప్రెషన్స్ రావు. డైలాగులు అర్థం చేసుకోవడం చాలా ఇబ్బందిగా ఉంది అని చెప్పారట. దీంతో వెంటనే చిరంజీవి డైరెక్టర్ వివి వినాయక్ ని పిలిపించి తెలుగు ట్రైనర్ ని ఏర్పాటు చేశారట. సినిమా స్క్రిప్ట్ లో ఉన్న ప్రతి డైలాగ్ ని సయాజీ షిండేకి అర్థం అయ్యేలా నేర్పించారట.
దీనికి తోడు డబ్బింగ్ విషయంలోనూ సయాజీకి చాలా హెల్ప్ చేశారట చిరంజీవి. తన పాత్రకు డబ్బింగ్ చెప్పడానికి వేరే వాళ్లని వెతుకుతోన్న సందర్భంలో చిరంజీవి దగ్గరకు వెళ్లిన ఆయన ‘సర్.. నా పాత్రకు నేను డబ్బింగ్ చెప్పుకుంటాను. వేరే వాళ్లు డబ్బింగ్ చెబితే నా బాడీ లాంగ్వేజ్ కు సెట్ కాదు. ఛాన్స్ ఇస్తే ట్రై చేస్తాను’ అని రిక్వెస్ట్ చేశాడట. దీనికి వెంటనే ఓకే చెప్పారట చిరంజీవి. డబ్బింగ్ పూర్తి చేసేందుకు 15 రోజుల సమయం తీసుకున్నా ఎంతో ఓపికగా ఏమీ అనకుండా సయాజీని ఎంకరేజ్ చేశారట మెగాస్టార్. కాగా చిరంజీవి ఠాగూర్ సినిమా తర్వాత తనకి తెలుగులో ఒక్కసారిగా పది చిత్రాల్లో ఆఫర్ వచ్చినట్లు సయాజీ షిండే తెలిపారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి