ఓటీటీలో థ్రిల్లర్ మూవీస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. థ్రిల్లర్ కంటెంట్‌ను ఇష్టపడే ప్రేక్షకుల కోసం చాలా సినిమాలు ముందుకు వచ్చాయి. అలాగే ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్స్ చాలానే ఉన్నాయి. ఇది ఇప్పుడు ఓటీటీలోకి వచ్చిన ఓ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఆ సినిమానే టెనెంట్. ఈ సినిమాలో సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించి మెప్పించారు. సత్యం రాజేష్ సినిమాలు ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. రీసెంట్ గా వచ్చిన పొలిమేర సిరీస్ తో మంచి విజయాన్ని అందుకుంది. హారర్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించి ఆకట్టుకున్నాడు. నెగిటివ్ రోల్ లో కనిపించి మెప్పించాడు సత్యం రాజేష్.
డైరెక్ట్ గా ఓటీటీలో విడుదల మా ఊరి పొలిమేర సినిమాలో బ్లాక్ మ్యాజిక్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో పొలిమేర 2 సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాధించింది. ఊహించని ట్విస్ట్ లతో ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు టెనెంట్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాగా టెనెంట్ సినిమా తెరకెక్కించారు.
ఈ సినిమాను ఏప్రిల్ 19న థియేటర్స్ లో విడుదల చేశారు. థియేటర్స్ లో ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేశారు. ఈ సినిమాను డైరెక్ట్ గా ఓటీటీలోకి వదిలారు. వై.యుగంధర్ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా ఊహించని ట్విస్ట్ లతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్ కథ కావడంతో ఆడియన్స్ బాగానే ఆకట్టుకుంటుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్ వీడియోలో టెనెంట్ సినిమా విడుదలైంది. ఎలాంటి అనౌన్స్‌మెంట్ లేకుండా సడన్ గా ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో సినిమాను మిస్సయిన వారు ఈ సినిమా ఓటీటీలో చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి ఈ సినిమా ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.