Actor Satyadev : సినిమా చూసి మహేష్ అన్న అర్దరాత్రి ఫోన్ చేసి ఆ రెండు మాటలు చెప్పాడు.. హీరో సత్యదేవ్..
విలక్షణ నటుడు సత్యదేవ్ తాజాగా నటించిన చిత్రం రావు బహదూర్. ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ చిత్రం గురించి అనేక విశేషాలు పంచుకున్నారు. మహేష్ బాబు సినిమా చూసి "తెలుగు సినిమాకు ప్రేమలేఖ" అని ప్రశంసించారని తెలిపారు. దర్శకుడు వెంకటేష్ మహా ఐదేళ్లు కష్టపడ్డారని, తనతో సహా చిత్రబృందం ఎంతో శ్రమించిందని సత్యదేవ్ ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం సత్యదేవ్ చేసిన కామెంట్స్ వైరలవుతున్నాయి.

టాలీవుడ్ నటుడు సత్యదేవ్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం రావు బహదూర్. ఈ సినిమా విడుదల సందర్భంగా ఆయన మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని, ముఖ్యంగా మహేష్ బాబు వాయిస్ ఓవర్ తో ఈ అంచనాలు మరింత పెరిగాయని ఆయన అన్నారు. సినిమా విడుదల ముందు కొంత ఉత్కంఠ సహజమేనని, తన ముఖంలో కనిపించిన టెన్షన్‌పై వచ్చిన ప్రశ్నకు ఆయన ఈ విధంగా స్పందించారు. తన కెరీర్‌లో ఇది అత్యంత పెద్ద చిత్రంగా కనిపిస్తోందని విజువల్స్, క్యాస్టింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ అద్భుతంగా ఉన్నాయని ఒక విలేకరి ప్రశంసించగా, చిత్రబృందం పడిన కష్టాన్ని సత్యదేవ్ వివరించారు. ఈ సినిమాను తమ వైపు నుంచి తెలుగు సినిమాకు ఒక “చిన్న ప్రేమలేఖ” అని అన్నారు. దర్శకుడు వెంకటేష్ మహా ఐదేళ్లు శ్రమించి కథను రాస్తే, తాను 80 రోజుల పాటు ప్రతి రోజు ఐదు గంటల చొప్పున మేకప్ వేసుకున్నానని తెలిపారు. అలాగే, సహనటులు తెలుగు నేర్చుకోవడానికి, ఇతర బృందం కూడా ఎంతో కష్టపడ్డారని ఆయన గుర్తుచేసుకున్నారు.
ఎక్కువ మంది చదివినవి : Arundhati Movie: అరుంధతి సినిమాను రిజెక్ట్ చేసి తప్పు చేశాను.. అతడు మాటలు విని వదిలేశా.. టాలీవుడ్ హీరోయిన్..
ఈ “ప్రేమలేఖ”ను రాసేటప్పుడు కొంతమంది స్నేహితుల సహాయం తీసుకున్నామని సత్యదేవ్ తెలిపారు. అనురాగ్, ఈశ్వరన్, గోపి, శరత్ వంటి వారు ఈ ప్రాజెక్ట్‌కు సహాయం అందించినట్లు పేర్కొన్నారు. ఈ మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత, ఒక “సూపర్ ప్రో” ఫ్రెండ్ మాదిరిగా మహేష్ బాబు ఈ సినిమాను చూసి ప్రశంసించారని సత్యదేవ్ వెల్లడించారు. “ఎస్, దిస్ ఈజ్ ద లవ్ లెటర్ టు తెలుగు సినిమా” అని మహేష్ బాబు అన్న మాటలు చిత్రబృందానికి గొప్ప ప్రోత్సాహాన్ని ఇచ్చాయని ఆయన పేర్కొన్నారు.
ఎక్కువ మంది చదివినవి : Murali Mohan: ఆ హీరోలాంటి మనిషి ఇంకొకరు ఉండరు.. పద్మ శ్రీ వచ్చిందని తెలిసి ఏమన్నారంటే.. మురళి మోహన్..
ఇటీవలి ప్రెస్ మీట్‌లో దర్శకుడు వెంకటేష్ మహా తన ఐదేళ్ల ప్రైమ్‌ను రావు బహదూర్ కోసం కేటాయించారని చెప్పిన విషయాన్ని సత్యదేవ్ గుర్తుచేశారు. దానికి కొనసాగింపుగా, తన దృష్టిలో వెంకటేష్ మహా “ప్రైమ్” జూలై 3వ తేదీ నుంచి మొదలు కాబోతుందని సత్యదేవ్ అన్నారు. వెంకటేష్ మహా ఇకపై ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరత్వరగా సినిమాలు చేయాలని, అది అందరికీ ఉపయోగపడుతుందని సత్యదేవ్ తన కోరికను వెల్లడించారు. వెంకటేష్ మహా భవిష్యత్తుపై తనకున్న నమ్మకాన్ని సత్యదేవ్ ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. రావు బహదూర్ తెలుగు ప్రేక్షకుల అంచనాలను తప్పకుండా అందుకుంటుందని, ఇది ఒక గొప్ప సినీ అనుభూతిని అందిస్తుందని సత్యదేవ్ ధీమా వ్యక్తం చేశారు.
ఎక్కువ మంది చదివినవి : Sunil: ఖలేజా సినిమా చేస్తున్నప్పుడు మహేష్ నాతో చెప్పిన మాట అదే.. నా గుండెను తాకింది.. సునీల్ కామెంట్స్..
ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఇంట్లోకి వెళ్లగానే సావిత్రిగారిని అలా చూసి ఏడ్చేశా.. మనిషి చిన్నగా అయిపోయి.. టాలీవుడ్ నటి కామెంట్స్..
