
హీరో సంతానం నటించిన తాజా చిత్రం ‘డీడీ నెక్స్ట్ లెవల్’. గతంలో వచ్చిన డీడీ, డీడీ రిటర్న్స్ సినిమాలకు కొనసాగింపుగా ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఈ శుక్రవారం (మే 16)న తమిళ్ తో పాటు తెలుగు భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది. తాజాగా సినిమా ప్రమోషన్లలో భాగంగా ఒక పాటను రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఇందులో శ్రీనివాస గోవింద పాటని పేరడీ చేయడం వివాదానికి దారి తీసింది. దీనిపై హిందు సంఘాలు భగ్గుమంటున్నాయి. ముఖ్యంగా ఈ పాటని వెంటనే తొలగించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే ‘డీడీ నెక్స్ట్ లెవల్’ సినిమా పాటపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఇప్పుడీ వివాదంపై హీరో సంతానం స్పందించాడు. తాజాగా జరిగిన ప్రెస్ మీట్ లో అతను మాట్లాడుతూ.. ‘తిరుమల శ్రీవారిని మేం అవమానించలేదు. సెన్సార్ బోర్డ్ నిబంధనల మేరకు సినిమా తీశాం. రోడ్డు మీద పోయే ప్రతి ఒక్కరూ ఏదో ఒకటి మాట్లాడుతారు. అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు’ అని చెప్పుకొచ్చాడు.
కాగా తిరుమల శ్రీవారికి సంబంధించిన శ్రీనివాస గోవింద అంటూ సాగే పాట తెలియని వారుండరు. అయితే ఈ గీతాన్ని ‘డీడీ నెక్స్ట్ లెవల్’ సినిమా కోసం పేరడీ చేశారు. పార్కింగ్ డబ్బులు గోవిందా.. పాప్ కార్న్ ట్యాక్స్ గోవిందా అంటూ సినిమా పదాలతో పేరడీ చేశారు. ఇప్పుడు దీనిపైనే హిందూ భక్తులు మండిపడుతున్నారు. పాటని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. మరి ఈ వివాదం ఎంతదాకా వెళుతుందో చూడాలి.
போற வர்றவனுக்குலாம் பதில் சொல்ல முடியாது 😏! Devils Double Next Level Press Meet #shorts https://t.co/3yn0R5WD3p#fridayfacts #santhanam #devilsdoublenextlevelpressmeet #ddnextlevel #arya pic.twitter.com/np9m1FM1lc
— Friday Facts (@fridayfacts_) May 13, 2025
ఇక డీడీ నెక్ట్స్ లెవల్ సినిమా విషయానికి వస్తే..ప్రేమ్ ఆనంద్ తెరకెక్కించిన ఈ మూవీలో సంతానం రివ్యూయర్ గా నటిస్తున్నాడు. గీతికా తివారీ హీరోయిన్ గా నటిస్తోంది. గౌతమ్ వాసుదేవ్ మేనన్, సెల్వ రాఘవన్, నిళళ్ గల్ రవి, కస్తూరి శంకర్, రెడిన్ కింగ్ స్లే, యషికా ఆనంద్, రాజేంద్రన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
మరిన్ని సినిమా కథనాల కోసం క్లిక్ చేయండి.