
రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగులోను రిషబ్ కు విపరీతమైన క్రేజ్ ఉంది. కన్నడ సినిమాల్లో టాప్ హీరోగా ఉన్న రిషబ్ శెట్టి కాంతారా సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సినిమా పాన్ ఇండియా వైడ్ గా విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. దాంతో రిషబ్ కు తెలుగులోనూ మంచి ఫ్యాన్స్ ఫాలోయింగ్ క్రియేట్ అయ్యింది. ఆతర్వాత కాంతార 1 సినిమాతో భారీ హిట్ అందుకున్నాడు రిషబ్. ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఈ సినిమా తర్వాత ఇప్పుడు తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నారు రిషబ్. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో జై హనుమాన్ సినిమాలో నటిస్తున్నారు.
జై హనుమాన్ సినిమా ఇటీవలే పూజాకార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో కనిపించనున్నారు రిషబ్. ఇదిలా ఉంటే తాజాగా రిషబ్ శెట్టి ఓ హీరోయిన్ ను అన్ ఫాలో చేయడం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఆ హీరోయిన్ ఎవరో కాదు కాంతార హీరోయిన్ రుక్మిణి వసంత్. రిషబ్ శెట్టి రుక్మిణిని అన్‌ఫాలో చేయడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
రుక్మిణి వసంత్ నే కాదు.. హోంబలే ఖాతాను అన్‌ఫాలో చేశారు. దాంతో అసలు ఏం జరుగుతుంది అంటూ ఇండస్ట్రీలో పెద్ద చర్చ జరుగుతుంది. హీరోయిన్, నిర్మాణ సంస్థనే కాదు, రిషబ్ శెట్టి తన అత్యంత సన్నిహితుడైన కన్నడ నటుడు రాజ్ బి. శెట్టిని కూడా అన్‌ఫాలో చేశారు. దాంతో కన్నడ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది.? రిషబ్ శెట్టికి నిర్మాణ సంస్థకు ఏదైనా చెడిందా.? అంటూ చర్చ జరుగుతుంది. షూటింగ్ సమయంలో వీరి మధ్య ఏవైనా విభేదాలు తలెత్తాయా లేక ఇది ఏదైనా కొత్త సినిమా ప్రమోషన్ స్ట్రాటజీనా అని సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.