Ajith Inspiring Story: చలన చిత్ర పరిశ్రమలో నటీనటులు ఆకర్షణీయమైన జీవితం గడుపుతున్నారు.. వారికేంటి.. ఆర్ధికంగా ఏ లోటు లేదు.. ఒక్క సినిమాలో నటిస్తే చాలు.. డబ్బుకి డబ్బు పేరుకి పేరు ..లగ్జరీ లైఫ్ అనుకంటారు.. అభిమానులు తమ హీరో వైభవాన్ని చూసి సంతోషపడితే.. మరికొందరు వారి వైభవం చూసి అసూయపడతారు.. కానీ నటీనటులు స్టార్ హోదాకు చేరడానికి వెనుక పడిన కష్టాలు వారిని దగ్గర నుంచి చూసిన వారికే తెలుసు. ముఖ్యంగా సినీ పరిశ్రమలో ఎవరి అండా లేకుండా ఎదిగిన రజనీకాంత్, చిరంజీవి, వంటి అనేక మంది నటినటులు కెరీర్ మొదట్లో ఎన్నో కష్టాలు అనుభవించారు..అలా ఆర్ధిక కష్ఠాలు పడిన హీరోల్లో కోలీవుడ్ సూపర్ స్టార్ అజిత్ కూడా ఉన్నారు.
అచ్చ తెలుగబ్బాయి.. తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరో అజిత్ నటుడే కాదు కారు రేసర్ అన్న సంగతి తెలిసిందే.. అజిత్ కు స్పోర్ట్స్ బైక్స్ అన్నా, స్పోర్ట్స్ కార్స్ చాలా ఇష్టం. సినిమాల్లో బైక్స్ నడిపే సన్నివేశాల్లో డూప్ లేకుండా నటిస్తాడు.. అనేకాదు.. చాలా మూవీస్ లో అజిత్ సొంత బైక్లు, కార్లు వాడిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి.
ఓ వైపు నటిస్తూనే అనేక కారు రేసుల్లో పాల్గొన్న అజిత్ ఒకానొక సందర్భంలో ఆర్థిక ఇబ్బందుల వల్ల తన బుల్లెట్ బైక్‌ను అమ్మాల్సి వచ్చిందట. అజిత్ తెలుగు లో ప్రేమ పుస్తకం అనే సినిమాతో పరిచయమైనా కోలీవుడ్ లో స్టార్ అయ్యాడు. ప్రేమ లేఖ వంటి సినిమాతో మంచిగుర్తింపు తెచ్చుకున్న అజిత్ కు ఎ.ఆర్. మురుగదాస్ డైరెక్ట్ చేసిన ‘దీన'(2001) కెరీర్ కు టర్నింగ్ పాయింగ్ అయ్యింది.
ఈ సినిమాలో అజిత్ నటనకు ఫ్యాన్స్ ఫిదా.. ‘తల’ అనే బిరుదుని కూడా ఇచ్చారు. అయితే ఈ యాక్షన్ సినిమాలో అజిత్ తన సొంత బుల్లెట్ బైక్‌ను ఉపయోగించాడు. ‘దీన’ మూవీలో అజిత్ అనుచరుల్లో ఒకడిగా నటించిన సంపత్ రావు ఆ బైక్ స్టోరీ ని గుర్తు చేసుకున్నాడు. అజిత్ ఆ సినిమా తర్వాత ఇంటి అద్దెను కూడా కట్టలేని పరిస్థితులను ఎదుర్కొన్నాడని.. అప్పుడు అజిత్ ఆ సినిమాలో వాడిన బైక్‌ను అమ్మి ఇంటి అద్దెతో పాటు.. ఆర్ధిక కష్టాలనుంచి గట్టెక్కాడని తెలిపాడు..
ఒకప్పుడు ఇంటి అద్దె కట్టలేని స్టేజ్ నుంచి ఈరోజు స్టార్ హీరోగా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునే వ్యక్తిగా స్వయం కృషితో ఎదిగిన అజిత్ ఎందరికో ఆదర్శం. ప్రస్తుతం వాలిమై సినిమా లో నటిస్తున్నాడు.
Also Read: ఓ వైపు ప్రాణాలు పోతుంటే రోడ్లు రిపేర్ చేయడానికి ఎన్ని దశాబ్దాలు కావాలంటున్న హైకోర్టు