2022లో విడుదలైన విరాట పర్వం తర్వాత వెండితెరపై కనిపించలేదు రానా దగ్గుబాటి. బాబాయి వెంకటేష్ తో కలిసి రానా నాయుడు అనే వెబ్ సిరీస్ లో మాత్రమే కనిపించారు. అలాగే నిఖిల్ నటించిన స్పై సినిమాలోనూ ఓ స్పెషల్ రోల్ లో తళుక్కున మెరిశాడీ హ్యాండ్సమ్ హల్క్. ఈ మధ్యన నటుడిగా కంటే నిర్మాతగానే ఎక్కువగా బిజిబిజీగా ఉంటున్నాడు రానా . తాను నటించనప్పటికీ ఇతర సినిమాలను ప్రమోట్ చేస్తున్నాడు. ఆన్ స్క్రీన్ సంగతి పక్కన పెడితే.. ఆఫ్ స్క్రీన్ లో రానా ఎంతో సరదాగా ఉంటాడు. తోటి నటీనటులతో చాలా జోవియల్ గా ఉంటాడు. ఈ కారణంగానే యంగ్ హీరోల సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఫంక్షన్లలో ఎక్కువగా కనిపిస్తుంటాడీ హ్యాండ్సమ్ హీరో. ఇదిలా ఉంటే మరోసారి తన మంచి మనసును చాటుకున్నాడు రానా. వివరాలిలా ఉన్నాయి.. ప్రస్తుతం అమెరికా వెకేషన్‌లో ఉన్నాడీ ట్యాలెంటెడ్ హీరో. అక్కడ అందమైన ప్రదేశాల్లో విహరిస్తూ ఎంజాయ్ చేస్తున్నాడు. అలా తాజాగా చికాగోలో కారులో వెళ్తుండగా రానాను చూశారు ఓ అభిమాని. డ్రైవింగ్ చేస్తూనే పరస్పరం పలకరించుకున్నారు. రానా కూడా హాయ్ ఎంతో ప్రేమగా అభిమానిని పలకరించాడు. అంతేకాకుండా ముందర కారు ఆపుతా అంటూ చెప్పారు. చెప్పినట్లుగానే కొద్ది దూరం వెళ్లాక కారు సైడ్ ను ఆపాడు. అంతే సదరు అభిమాని రానాను గట్టిగా హగ్ చేసుకొని ఎమోషనల్ అయిపోయారు. రానా కూడా తన ఫ్యాన్‌తో పాటు ఆయన ఫ్యామిలీని కూడా పలకరించరు. అందరూ కలిసి సరదాగా ఫొటోలు దిగారు
అయితే ఆ ఫ్యాన్ తన గుండెలపై ఆటోగ్రాఫ్ చెయ్యాలంటూ రానాను కోరారు. దీనికి ముందు రానా వద్దన్నాడు. అయితే చెప్పినా వినకుండా తన షర్ట్‌పై ఆటోగ్రాఫ్ చేయించుకున్నారు ఆ ఫ్యాన్. అలానే తన కారుపై కూడా సైన్ చేయాలంటూ కోరారు. ఆయన అభిమానాన్ని చూసి రానా కూడా మురిసిపోయారు. కోరినట్లుగానే కారుపై ఆటోగ్రాఫ్ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనిని చూసిన అభిమానులు, నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అందుకే అన్నా.. నువ్వంటే మాకిష్టం’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
Rana Daggubati Fan Encounter at Chicago🤩🤩🔥🔥
What a Lovely gesture🙌✨#RanaDaggubati pic.twitter.com/T0GqHe7na7
— Filmy Bowl (@FilmyBowl) August 19, 2024
కాగా రానా ప్రస్తుతం ‘వేట్టయాన్’ చిత్రంలో కీలకపాత్రలో నటిస్తున్నారు. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రజనీకాంత్ హీరోగా నటిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
Actor @RanaDaggubati in his natural habitat off screen 🤩#RanaDaggubati #Rana #Tollywood #PopperStopTelugu pic.twitter.com/FiCISww8Ip
— Popper Stop Telugu (@PopperstopTel) July 22, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.