Tollywood: చిన్నప్పుడు అంత అమాయకంగా ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు మ్యాన్లీ హీరో
ఈ ఫోటోలోని చిన్నోడు.. ఇప్పుడు టాలీవుడ్‌లో మంచి యాక్టర్‌గా రాణిస్తున్నాడు. పాత్ర ప్రాధాన్యం ఉన్న సినిమాలు చేస్తూ అందరి ప్రశంసలు పొందుతున్నాడు. తాజాగా అతడు తన తల్లితో చిన్నప్పుడు దిగిన ఫోటో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ నటుడు ఎవరో మీరు కనిపెట్టగలరా..?
మేం హీరో రోల్స్ మాత్రం చేస్తాం.. అని కొంతమంది యాక్టర్స్ గిరిగీసుకుని ఉంటారు. అలాంటి వారికి అరుదుగా మాత్రమే.. తన టాలెంట్ చూపే అవకాశం ఉంటుంది. ఇంకొందరు ఉంటారు.. తమ స్కిల్ బయటపెట్టే ఎలాంటి పాత్ర అయినా రెడీ అంటారు. తమ పాత్ర నిడివి.. పాటలు, ఫైట్స్ గురించి ఆలోచించరు. విజయ్ సేతుపతి, రానా లాంటి వారు ఈ కోవకు చెందినవారు. ఇక స్వయంకృషితో ఎదిగిన యాక్టర్ నవీన్ చంద్ర సైతం ఈ రూట్లోనే ప్రయాణిస్తున్నాడు. ఒకవైపు తనకు తగ్గ హీరో పాత్రలు వేస్తూనే.. మరోవైపు ఇతర హీరోల సినిమాల్లో కీ రోల్స్ పోషిస్తూ ముందుకు సాగుతున్నాడు. అవకాశం వచ్చినప్పుడు తనలోని విలనిజం కూడా చూపిస్తున్నాడు. నవీన్ చంద్ర మన తెలుగోడే. కాకపోతే బళ్లారిలోని దేవి నగర్‌లో పుట్టాడు. అతని తండ్రి కర్నాటక రోడ్డు రవాణా సంస్థలో హెడ్ మెకానిక్. నవీన్.. మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేశాడు. చిత్రపరిశ్రమకు రాకముందు.. మల్టీమీడియా యానిమేటర్‌గా వర్క్ చేశాడు.
2006లోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. 2012లో వచ్చిన అందాల రాక్షసి సినిమా ద్వారా అతడికి మంచి ఫేమ్ దక్కింది. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. మార్కెట్ రేంజ్ పెరగకపోవడంతో… నేను లోకల్ సినిమాలో విలన్ ఛాయలున్న రోల్ చేశాడు. ఆ తర్వాత నవీన్‌కు మంచి అవకాశాలు వచ్చాయి. అరవింద సమేత వీరరాఘవ మూవీలో.. నెక్ట్స్ లెవల్ యాక్టింగ్‌తో దుమ్మురేపాడు. ఆ తర్వాత ఓటీటీలో రిలీజైన భానుమతి & రామకృష్ణ చిత్రంతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. వీరసింహారెడ్డి మూవీలోనూ నవీన్ రోల్‌కు మంచి మార్కులు పడ్డాయి. ప్రస్తుతం ఎలెవన్ అనే మూవీ చేస్తున్నాడు. తాజాగా అతడు తన తల్లితో చిన్నప్పుడు దిగిన ఫోటో సోషల్ మీడియాలో అవుతోంది. అందులోని చిన్నోడు.. నవీన్ చంద్ర అంటే చాలామంది నమ్మలేకపోతున్నారు. ః
Naveen Chandra celebrates his Birthday with his mother…
Then and now #childhood #present pic.twitter.com/NXkpwkZi9p
— I Luv Cinema.IN (@ILuvCinemaIN) December 2, 2015
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.