Happy Birthday Ram Pothineni: మొదటి సినిమాతోనే టాలెంటెడ్ హీరో అనిపించుకున్నారు రామ్ పోతినేని. దేవదాసు సినిమాతో వెండితెరకు హీరోగా పరిచయమైన రామ్.. మొదటి సినిమాలోనే అటు మాస్ కుర్రాడిగానూ.. ఇటు లవర్ బాయ్‍గా కనిపించి మంచి గుర్తింపు పొందారు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా మారిన ఈ ఎనర్జిటిక్ స్టార్ గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం.
రామ్ పోతినేని.. 1988 మే 15న మురళీ పోతినేని, పద్మశ్రీ దంపతులకు జన్మించారు. 2002లో తమిళంలో తెరకెక్కిన అడయాళం అనే షార్ట్ ఫిలిమ్‌తో యాక్టింగ్ కెరీర్ ప్రారంభించారు రామ్. ఆ తర్వాత వై.వీ.ఎస్.చౌదరీ డైరెక్షన్‌లో 2006లో తెరకెక్కిన దేవదాసు సినిమాతో వెండితెరకు పరిచయమయ్యారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఆ తర్వాత రామ్ కు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. 2008లో శ్రీను వైట్ల దర్శకత్వంలో రామ్ నటించిన ‘రెడీ’ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాని హిందీలో స్టార్ హీరో సల్మాన్ ఖాన్ కూడా రీమేక్ చేశారు. ఇక ఈ సినిమా తర్వాత ఈ ఎనర్జిటిక్ స్టార్ పెద్దగా అందుకోలేకపోయాడు. ఆ తర్వాత వచ్చిన ‘మస్కా’, ‘రామరామ కృష్ణకృష్ణ’, ‘ఎందుకంటే ప్రేమంట’, ‘ఒంగోలు గిత్త’, ‘మసాలా’, ‘పండగ చేస్కో’, ‘హైపర్’, ‘హలో గురు ప్రేమ కోసమే’ ఇతర సినిమాలు ఆశించినంత హిట్ సాధించలేకపోయాయి. కానీ రామ్ తన నటనతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. ఇక 2019లో మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అప్పటివరకు కేవలం లవర్ బాయ్‍గా కనిపించిన రామ్ ఒక్కసారిగా హైదరాబాదీ మాస్ రౌడీగా కనిపించి ఆడియన్స్ను ఆకట్టుకున్నారు. వరుసగా ప్లాపులతో నెట్టుకొస్తున్న రామ్ కు ఇస్మార్ట్ శంకర్ సినిమా ఒక్కసారిగా తన ఇమెజ్ ను మార్చేసింది. ఇక ఈ మూవీ తర్వాత రామ్ ఇటీవల రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇందులో మొదటి సారి రామ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ సినిమా అతని కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచింది. ప్రస్తుతం రామ్ లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.
Also Read: మూడు సంవత్సరాల వయసులో నేర్చుకున్న నాట్యం.. తన జీవితాన్నే మార్చేసింది.. మాధురి దీక్షిత్ గురించి ఆసక్తికర విషయాలు..
టాలీవుడ్ పరిశ్రమలో మరో విషాదం.. గుండె నొప్పితో పవన్ కళ్యాణ్ హీరోయిన్ తండ్రి మృతి..