ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. ఇందులో అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించి మెప్పించాడు చరణ్. తన నటనతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు, సినీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకున్నాడు చరణ్. అంతేకాకుండా మునుపటి సినిమాల కంటే ఆర్ఆర్ఆర్ లో చరణ్ పవర్ ఫుల్ లుక్‌లో కనిపించిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద సెన్సెషన్ సృష్టించిన ఈ మూవీ తర్వాత మెగా పవర్ స్టార్ ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆర్సీ 15 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై భారీగానే అంచనాలు నెలకొన్నాయి. అంతేకాకుండా ఇందులో పొలిటికల్ టచ్ ఉంటుందనే వార్తలు నెట్టింట వైరల్ కావడంతో ఈ మూవీపై మరింత హైప్ పెరిగింది. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి చరణ్ ఫోటో లీకైన సంగతి తెలిసిందే. అందులో చరణ్ మరింత ఫవర్ ఫుల్ అండ్ స్లైలీష్ లుక్‌లో కనిపించాడు. దీంతో ఆర్సీ 15 ద్వారా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నాడు.
ఇక తాజాగా లాల్ సింగ్ చద్దా ప్రివ్యూ కోసం అమీర్ ఖాన్ మెగాస్టార్ ఇంటికి వచ్చిన సందర్భంలో చరణ్ మరో లుక్‌లో కనిపించి షాకిచ్చాడు. గత వారం పది రోజుల క్రితమే తన హెయిర్ స్టైలిస్ట్ తో ఒక కొత్త లుక్స్ సిద్దం చేసుకుని కనిపించగా.. మరుసటి రోజే క్లీన్ షేవ్ లుక్ లో.. తక్కువ హెయిర్ తో కనిపించాడు. మళ్లీ వారం రోజుల వ్యవధిలోనే మెగాస్టార్ చిరంజీవి షేర్ చేసిన వీడియోలో అమీర్ ఖాన్‌తో కలిసి ఉన్నప్పుడు చరణ్ మళ్లీ పాత లుక్‌లో కనిపించాడు. దీంతో చరణ్ లుక్స్ ట్విస్ట్ అర్థం కావట్లేదంటున్నారు ఫ్యాన్స్. రోజుల వ్యవధిలోనే చరణ్ లుక్స్ ఇలా మార్చేస్తున్నాడేంటంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆదివారం ఉదయం తన ఇన్ స్టాలో జిమ్ వీడియోను షేర్ చేశారు. అందులో మళ్లీ చరణ్ షేవింగ్ లుక్‌లో కనిపించి ఆశ్చర్యపరిచాడు. మొత్తానికి తన లేటేస్ట్ లుక్స్‌తో ఫ్యాన్స్‌ను అయోమయంలో పడేస్తున్నారు చరణ్.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.