Rajinikanth: ఇంటికి పిలిపించి మరీ గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన రజనీకాంత్.. ఇంతకీ ఎవరితను?

కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ ఇటీవల ఒకరిని తన ఇంటికి ఆహ్వానించాడు. కుటుంబంతో వచ్చిన అతనికి ఏకంగా బంగారు చెయిన్ గిఫ్టుగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు నెట్టింట బాగా వైరలవుతోంది. మరి ఇంతకీ ఎవరతను? రజనీకాంత్ ఎందుకు గోల్డ్ చెయిన్ గిఫ్టు గా ఇచ్చాడో తెలుసుకుందాం రండి.

Rajinikanth: ఇంటికి పిలిపించి మరీ గోల్డ్ చెయిన్ గిఫ్ట్‌గా ఇచ్చిన రజనీకాంత్.. ఇంతకీ ఎవరితను?
Rajinikanth

Updated on: Jan 25, 2026 | 5:19 PM

సూపర్ స్టార్ రజనీకాంత్ చివరిగా కూలీ సినిమాలో నటించారు. లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ హై ఓల్డేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత వెంటనే ఆయన తదుపరి చిత్రం జైలర్ 2లో షూటింగ్ లో నిమగ్నమయ్యారు. దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం 2026 ఆఖరులో విడుదలవుతుందని భావిస్తున్నారు. ఒక వైపు జైలర్ 2 విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా, రజనీకాంత్ రాబోయే చిత్రం తలైవర్ 173 గురించి అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ చిత్రానికి సిబి చక్రవర్తి దర్శకత్వం వహించనున్నారని సమాచారం. నటుడు కమల్ హాసన్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా సినిమా షూటింగుల్లో బిజీగా ఉంటోన్న రజనీకాంత్ తన అభిమానులను కలుస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఒక అభిమానిని కలుసుకున్నారు. ఫోన్ చేసి మరి అతనిని ఇంటికి పిలిపించుకున్న సూపర్ స్టార్ ఆ వ్యక్తికి బంగారు గొలుసును బహుమతిగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

తమిళనాడులోని మధురైలో శేఖర్ అనే వ్యక్తి.. పరోటా షాప్ నడుపుతున్నాడు. గత 13 ఏళ్ల నుంచి కేవలం 5 రుపాయలకే పరోటా అమ్ముతున్నాడు. గతంలో ఇతడికి సంబంధించిన పలు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఇతని పేరు శేఖర్ అయినప్పటికీ అందరూ రజనీకాంత్ శేఖర్ అని పిలుస్తుంటారు. ఎందుకంటే ఇతను సూపర్ స్టార్ కు వీరాభిమాన . ఈ క్రమంలోనే తాజాగా రజనీ నుంచి శేఖర్ కుటుంబానికి పిలుపు వచ్చింది. ఈ సందర్భంగా కుటుంబ సమేతంగా శేఖర్ ను ఇంటికి ఆహ్వానించిన రజనీకాంత్.. అతనికిబంగారు చెయిన్ బహుమతిగా ఇచ్చారు.

ఇవి కూడా చదవండి

రజనీకాంత్ తో శేఖర్ ఫ్యామిలీ..

రూ. 5 కే పరోటా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.