Kalki 2898 AD: కల్కిలో మరో టాలీవుడ్ సీనియర్ హీరో.. మొదటిసారి ప్రభాస్ మూవీలో ఆ నటుడు..

ఇటీవలే గుర్గావ్ లో జరిగిన సినాప్స్ 2024లో పాల్గొన్న నాగ్ అశ్విన్ కల్కి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ 6000 ఏళ్ల మధ్య జరిగే కథను చూపిస్తుందని.. ఇందుకు సరికొత్త ప్రపంచాలనే సృష్టించామని అన్నారు. ఈ మూవీలోని పాత్రలన్ని ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయని... భవిష్యత్తు ప్రపంచం ఎలాంటి ఉంటుందో చూపించే ప్రయత్నం కూడా చేశామని అన్నారు. అందుకు ఓ ఊహా ప్రపంచాన్ని రూపొందించామని..

Kalki 2898 AD: కల్కిలో మరో టాలీవుడ్ సీనియర్ హీరో.. మొదటిసారి ప్రభాస్ మూవీలో ఆ నటుడు..
Kalki 2898 Ad Movie
Follow us
Rajitha Chanti

|

Updated on: Mar 01, 2024 | 1:55 PM

భారీ అంచనాల మధ్య అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమా ‘కల్కి 2898 AD’. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామాపై ఇప్పటికే ఓ రేంజ్ హైప్ క్రియేట్ అయ్యింది. ఇందులో డార్లింగ్ మునుపెన్నడు చూడని పాత్రలో కనిపించనున్నాడు. అలాగే ఇందులో బాలీవుడ్ స్టార్స్ అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె, దిశా పటానీ, కమల్ హాసన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ పై అశ్వనీదత్ నిర్మిస్తున్న ఈ మూవీ గురించి నిత్యం ఏదోక వార్త సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అవుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర వార్త ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. అదెంటంటే.. ఈ సినిమాలో తెలుగు నటుడు రాజేంద్రప్రసాద్ కీలకపాత్ర పోషిస్తున్నారట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. ‘వందల కోట్లతో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. నేను ప్రాజెక్ట్ కె లో కూడా నటిస్తున్నాను. అలాగే మహేష్ బాబుతో ఓ సినిమా కూడా చేస్తున్నాను’ అని అన్నారు. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతున్న వీడియో మాత్రం ఎప్పటిదనేది క్లారిటీ లేదు. కానీ ఇదే నిజమైతే.. మొదటిసారి ప్రభాస్, రాజేంద్ర ప్రసాద్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు.

ఇటీవలే గుర్గావ్ లో జరిగిన సినాప్స్ 2024లో పాల్గొన్న నాగ్ అశ్విన్ కల్కి సినిమాపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఈ మూవీ 6000 ఏళ్ల మధ్య జరిగే కథను చూపిస్తుందని.. ఇందుకు సరికొత్త ప్రపంచాలనే సృష్టించామని అన్నారు. ఈ మూవీలోని పాత్రలన్ని ఇండియన్ మైథాలజీ చుట్టే ఉంటాయని… భవిష్యత్తు ప్రపంచం ఎలాంటి ఉంటుందో చూపించే ప్రయత్నం కూడా చేశామని అన్నారు. అందుకు ఓ ఊహా ప్రపంచాన్ని రూపొందించామని.. క్రీ.శ. 3102 నుంచి క్రీ.శ 2898 వరకు మొత్తం 6000 సంవత్సరాల వెనుక కథను సిద్ధం చేశామని అన్నారు. దీంతో ఈ మూవీపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఈ చిత్రాన్ని ఈ ఏడాది మే 9న రిలీజ్ చేయనున్నట్లు ఇదివరకే ప్రకటించారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.