Prabhas: శ్రీదేవి సోడా సెంటర్ పై ప్రభాస్ ఇంట్రెస్ట్.. చిత్రయూనిట్‏తో డార్లింగ్ ముచ్చట్లు..

|

Aug 26, 2021 | 8:46 PM

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు.. ఆనంది జంటగా తెరకెక్కుతున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. పలాస 1978 ఫేమ్ కరుణాకర్ ఈ చిత్రానికి

Prabhas: శ్రీదేవి సోడా సెంటర్ పై ప్రభాస్ ఇంట్రెస్ట్.. చిత్రయూనిట్‏తో డార్లింగ్ ముచ్చట్లు..
Prabhas
Follow us on

టాలెంటెడ్ హీరో సుధీర్ బాబు.. ఆనంది జంటగా తెరకెక్కుతున్న సినిమా శ్రీదేవి సోడా సెంటర్. పలాస 1978 ఫేమ్ కరుణాకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా.. విజయ్ చిల్లా, శశిధర్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ మూవీ ఆగస్ట్ 27న థియేటర్లలో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, పోస్టర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‏లో భాగంగా ప్రభాస్ కూడా రంగంలోకి దిగాడు. ఈ సినిమా కోసం ఓ స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గోన్నారు. ఇందులో హీరో సుధీర్ బాబుతోపాటు… దర్శక నిర్మాతలు కూడా పాల్గొన్నారు.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ప్రభాస్ మాట్లాడుతూ.. విజయ్ చిల్లా తనకు చాలా కాలం నుంచి తెలుసని.. తను శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చూపించగానే చాలా నచ్చిందన్నారు. హీరోయిన్ నటన చాలా బాగుందని సుధీర్ బాబు బాడీ గ్లిమ్స్ ఆఫ్ సూరిబాబులో బోట్ రేస్ పెట్టడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో నిర్మాత విజయ్ చిల్లా మాట్లాడుతూ.. ఈ సినిమా కథ ప్రభాస్ కు చెప్పాను. సాధారణంగా ప్రభాస్ ఏదైనా కథ చెబితే ఓకే అంటాడు. కానీ ఈ కథ చెబుతున్నంతసేపు ఏం జరుగుతుంది… ఆ తర్వాత ఏమైంది అని అడుగుతూనే ఉన్నాడు అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఆ తర్వాత సుధీర్ బాబు మాట్లాడుతూ.. కథ విన్న వెంటనే కాస్త భయంగా అనిపించిందని.. ఫిజికల్‏గా చాలా కష్టపడాల్సి వచ్చిందని తెలిపారు. అలాగే షూట్ ప్రారంభించిన మొదట్లోనే ఫిజిక్ చూపించే షాట్స్ తీయాలనుకున్నామని.. కానీ ప్రతి సారి ఆ షాట్స్ వాయిదా పడుతూ వచ్చాయని తెలిపారు. దీంతో షూట్ చివర్లో ఆ సీన్స్ చేశామని.. అందుకు చాలా ఇబ్బంది పడినట్లుగా తెలిపారు. షూట్ జరుగుతున్న సమయంలో గాయాలు కూడా అయ్యాయని తెలిపారు. ఇక స్క్రీప్ట్ విన్న ప్రారంభంలోనే ఇందులో హీరోయిన్‏గా తెలుగమ్మాయిని తీసుకోవాలనుకున్నట్లుగా తెలిపారు. గోదావరి భాషలో చక్కగా మాట్లాడే అమ్మాయి అయితే బాగుంటుందనుకున్నాం… కథ రెడి చేసుకున్నాక ఎంతోమందిని ఆడిషన్స్ లుక్ టెస్ట్ చేశాం. చివరికి ఆనందిని సెలక్ట్ చేసుకున్నాం అని తెలపారు.

వీడియో..

Also Read: Tamarind Benefits: చింతపండుతో డయాబెటిక్‏కు చెక్.. రక్తపోటును నియంత్రించే సంజీవని.. ప్రయోజనాలు తెలిస్తే వదలడం కష్టమే..