Tollywood: వారు చేతబడి చేసి నా భార్యను చంపేశారు.. స్టార్ నటి మరణంపై టాలీవుడ్ విలన్ షాకింగ్ కామెంట్స్

తెలుగులో పలు సూపర్ హిట్ సినిమాల్లో విలన్ గా ఆకట్టుకున్నాడీ ట్యాలెంటెడ్ నటుడు. మహేష్ బాబు 'సర్కారు వారి పాట' , పవన్ కళ్యాణ్ 'అజ్ఞాతవాసి', వెంకటేష్ 'వెంకీమామ' తదితర సినిమాల్లో ఇతను పోషించిన విలన్ పాత్రలకు మంచి పేరొచ్చింది. అయితే కొన్ని రోజుల క్రితం ఈ నటుడి జీవితంలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Tollywood: వారు చేతబడి చేసి నా భార్యను చంపేశారు.. స్టార్ నటి మరణంపై టాలీవుడ్ విలన్ షాకింగ్ కామెంట్స్
Parag Tyagi, Shefali Jariwala

Updated on: Jan 18, 2026 | 6:55 PM

పరాగ్ త్యాగి.. పేరు చెబితే గుర్తు పట్టరు కానీ పై ఫొటోను చూస్తే చాలా మంది ఈ నటుడిని గుర్తు పడతారు. ఎక్కువగా హిందీ సినిమాలు, టీవీ సీరియల్స్, ప్రోగ్రామ్స్ లో కనిపించే ఇతను టాలీవుడ్ ఆడియెన్స్ కు కూడా బాగా పరిచయమే. ముఖ్యంగా తెలుగు సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ గా నటించి మెప్పించాడు పరాగ్ త్యాగి. పవర్ స్టార్ పవన్ కళ్యాన్ ‘అజ్ఞాతవాసి’, సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’, విక్టరీ వెంకటేష్ – యువసామ్రాట్ నాగ చైతన్య ‘వెంకీ మామ’, బాలకృష్ణ ‘రూలర్’ తదితర తెలుగు సినిమాల్లో పవర్ ఫుల్ విలన్ రోల్స్ తో ఆకట్టుకున్నాడీ బాలీవుడ్ నటుడు. హిందీలోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించాడు పరాగ్. అమితాబ్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో విలన్ గా ఆకట్టుకున్నాడు. అయితే ఇటీవల పరాగ్ త్యాగి జీవితంలో ఒక తీవ్ర విషాదం చోటు చేసుకుంది. అతని భార్య ప్రముఖ నటి షెఫాలీ జరీవాలా (41) అకస్మాత్తుగా కన్నుమూసింది. హిందీ సాంగ్ ‘కాంటా లాగా’ తో నేషనల్ వైడ్ పాపులర్ అయిన ఆమె మరణం అందరినీ షాకింగ్ కు గురిచేసింది. అయితే షెఫాలీ మరణంపై చాలా రూమర్లు వచ్చాయి. యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్లనే నటి చనిపోయిందని ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు షెఫాలీ జరీవాలా మరణంపై ఆమె భర్త పరాగ్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఇటీవల ఒక పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ నటుడు

‘దేవుడు ఎక్కడ ఉంటాడో, అక్కడ దెయ్యం కూడా ఉంటుంది. నేడు ప్రజలు తమ బాధల కంటే ఇతరుల ఆనందం, సంతోషాన్ని చూసే ఎక్కువ బాధ పడుతున్నారు. నా భార్య పై ఎవరు చేతబడి చేశారో నాకు తెలుసు. కానీ, నేను చెప్పలేను. ఏదో తప్పుగా ఉందని, జరిగిందని నేను భావిస్తున్నాను. ఒకసారి కాదు, రెండుసార్లు మాపై చేతబడి జరిగింది. ఒకసారి బయటపడ్డాము. కానీ, రెండో సారి అది కొంచెం భారీగా చేశారు. ఏమి జరిగిందో నాకు తెలియదు’ అని పరాగ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

భార్యతో పరాగ్ త్యాగి..

కాగా షెఫాలీ జరీవాలా గతేడాది జూన్ 27 న మరణించింది. వైద్యుల నివేదికలో ఆమె గుండె పోటుతో చనిపోయిందని తేలింది. అయితే షెఫాలీ మరణం తర్వాత పరాగ్ బాగా కుంగిపోయాడు. తన భార్య మరణాన్ని అసలు జీర్ణించుకోలేకపోతున్నాడు. ఈ క్రమంలోనే తన భార్యను మర్చిపోలేక తన ఛాతీపై షెఫాలీ ఫేస్‌ను పెద్ద టాటూగా కూడా వేయించుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి