Nivin Pauly: లైంగిక వేధింపుల కేసు.. ప్రేమమ్ హీరోకు ఊరట.. కోర్టు ఏం చెప్పిందంటే..

సినిమా అవకాశం ఇప్పిస్తానని చెప్పి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడంటూ ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదుతో హీరో నివిన్ పౌలీపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అతడితోపాటు మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు కాగా.. తాజాగా ఈరోజు ఈ కేసుపై విచారణ జరిగింది. ఇందులో నివిన్ పౌలి లైంగికంగా వేధించినట్లు స్పష్టమైన ఆధారాలు లభించలేదని తెలిపింది.

Nivin Pauly: లైంగిక వేధింపుల కేసు.. ప్రేమమ్ హీరోకు ఊరట.. కోర్టు ఏం చెప్పిందంటే..
Nivin Pauly Reacts
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 06, 2024 | 7:36 PM

ఆత్యాచారం ఆరోపణలు ఎదుర్కొన్న మలయాళీ హీరో నివిన్ పౌలీ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అతడితోపాటు మరో ఆరుగురిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదైంది. జస్టస్ సినిమాలో అవకాశం ఇప్పిస్తానని చెప్పి చిత్రహింసలకు గురిచేశారంటూ యువతి చేసిన ఫిర్యాదుతో ప్రేమమ్ హీరో నివిన్ పౌలీపై కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో నివిన్ పౌలీ ఆరో నిందితుడు. తాజాగా బుధవారం కొత్తమంగళం మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కేసుపై విచారణ జరగ్గా.. ఇందులో నివిన్ పౌలీకి క్లీన్ చీట్ ఇచ్చింది కోర్టు. అందులో నిందితుల జాబితా నుంచి అతడి పేరును తొలగించారు. వేధింపులు జరిగినట్లు సదరు మహిళ ఆరోపించిన సమయంలో లేదా ఆ రోజు నటుడు దుబాయ్‌లో లేరని కూడా దర్యాప్తు బృందం కోర్టుకు సమర్పించిన నివేదికలో వెల్లడించింది. ఈ కేసులో ఇతర నిందితులపై విచారణ కొనసాగుతుంది.

నెరియమంగళానికి చెందిన మహిళ నివిన్ పౌలీపై ఆత్యాచారం ఆరోపణలు చేసింది. సినిమాలో అవకాశం ఇప్పిస్తానని తనను దుబాయ్ తీసుకెళ్లి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో శ్రేయ అనే మహిళను మొదటి ముద్దాయిగా చేర్చారు. వీరిద్దరితోపాటు మరో నలుగురిపై కేసు నమోదు కాగా.. తనపై వచ్చిన ఆరోపణలలో ఎలాంటి నిజం లేదంటూ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు నివిన్ పౌలీ. యువతి ఫిర్యాదు చేసిన రోజున తాను కొచ్చిలోని షూటింగ్ లొకేషన్‌లో ఉన్నానని, పాస్‌పోర్టును పరిశీలిస్తే ఈ విషయం స్పష్టమవుతుందని నివిన్ దర్యాప్తు బృందానికి తెలియజేశాడు.

డబ్బులు, ఫేమ్ కోసమే సదరు మహిళ ఇలాంటి ఆరోపణలు చేస్తుందని నివిన్ పౌలీ వాపోయాడు. ఆ మహిళ ఎవరో తనకు తెలియదని.. ఆమె వెనక ఉన్న వారిని తీసుకొచ్చి న్యాయపరంగా కేసును ఎదుర్కొనేందుకు ఎంతకైనా తెగిస్తానని నివిన్ చెప్పాడు. నివిన్ పౌలీపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని రుజువు చేసే సాక్ష్యాలను నటుడు స్నేహితులు కూడా విడుదల చేశారు.

ఇది చదవండి : Arundhati movie: తస్సాదియ్యా.. అసలేం మారలేదు.. అరుంధతి డ్యాన్స్ టీచర్‏ను చూశారా..?

Anshu Ambani: మతిపోగొట్టేస్తోన్న మన్మథుడు హీరోయిన్.. కొత్త ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న అన్షు..

Tollywood: నడుమందాలతో తికమక పెట్టేస్తోన్న వయ్యారి.. హిట్టు కొట్టిన క్రేజీ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.