జయం సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు హీరో నితిన్.. మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ హీరో.. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ హీరోలలో తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు. హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతున్నాడు. యూత్‌లో నితిన్ కు ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జయం, దిల్, సంబరం, శ్రీ ఆంజనేయం, సై, ధైర్యం వంటి హిట్ చిత్రాలతో పాం కొనసాగించిన నితిన్.. ఆ తర్వాత వరుస ప్లాపులతో కాస్త వెనకపడ్డాడు.. ఆ తర్వాత ఇష్క్ బ్లాక్ బస్టర్ హిట్ తో మరోసార ఫాంలోకి వచ్చాడు. ఇష్క్, గుండెజారి గల్లంతయ్యిందే, అఆ, భీష్మ సినిమాలతో ప్రేక్షకులను అలరించిన నితిన్.. ప్రస్తుతం మాచర్ల నియోజకవర్గం సినిమా చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే.. నితిన్ సినీ ప్రయాణం పెట్టి నేటితో 2 దశాబ్ధాలు.. ఈ సందర్భంగా తన ఇన్ స్టాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు నితిన్.. “20 ఏళ్ల క్రితం జయం సినిమాతో నా సినీ ప్రయాణం మొదలు పెట్టాను.. ఇప్పుడు నేనేం చెప్పాలో కూడా నాకు మాటలు రావట్లేదు.. మొదటగా నన్ను నమ్మి నటునిగా వెండితెరకు పరిచయం చేసిన దర్శకుడు తేజ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.. నా మిగతా దర్శకులు, నిర్మాతలు, నటులు, టెక్నీషియన్స్, ఇలా నేను పని చేసిన సినిమాకు ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. ముఖ్యంగా ఇన్నేళ్లుగా నన్ను అభిమానిస్తూ నన్నే ఫాలో అవుతూ చెరగని ప్రేమని అందిస్తున్న అభిమానుల ప్రేమకు అయితే ఎప్పటికీ హృదయాపూర్వకంగా ఋణపడి ఉంటాను. ” అంటూ చెప్పుకొచ్చారు.
❤️❤️❤️ pic.twitter.com/WbhRMZMac3
— nithiin (@actor_nithiin) June 14, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.