Nikhil Siddhartha: ఏపీలో ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్.. హీరో నిఖిల్ పోస్ట్ వైరల్

గతంలో పోల్చుకుంటే ఈసారి ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది. చాలామందికి మంచి ర్యాంక్ లు తెచ్చుకున్నారు. మరికొందరు పాస్ మార్కులతో సరిపెట్టుకున్నారు. ఇదే సమయంలో దురదృష్టవశాత్తూ ఫెయిల్ అయిన విద్యార్థులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ స్పందించాడు.

Nikhil Siddhartha: ఏపీలో ఇంటర్ ఫలితాల ఎఫెక్ట్.. హీరో నిఖిల్ పోస్ట్ వైరల్
Nikhil Siddhartha
Follow us
Basha Shek

|

Updated on: Apr 13, 2024 | 5:14 PM

ఆంధ్రప్రదేశ్‌ లో శుక్రవారం (ఏప్రిల్ 13) ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఏపీ ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు ఒకేసారి ఫస్ట్ ఇయర్, సెకెండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేశారు. గతంలో పోల్చుకుంటే ఈసారి ఉత్తీర్ణత శాతం బాగా పెరిగింది. చాలామందికి మంచి ర్యాంక్ లు తెచ్చుకున్నారు. మరికొందరు పాస్ మార్కులతో సరిపెట్టుకున్నారు. ఇదే సమయంలో దురదృష్టవశాత్తూ ఫెయిల్ అయిన విద్యార్థులు మనస్తాపానికి గురై ఆత్మహత్యలు చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ విషయంపై టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ స్పందించాడు. ఇంటర్మీడియెట్ లో తప్పిన విద్యార్థుల కోసం కోసం ఓ మోటివేషనల్ ట్వీట్ వదులు అన్నా? అంటూ ఓ నెటిజన్ హీరో నిఖిల్ సిద్ధార్థను అడిగాడు. దీనిపై స్పందించిన నిఖిల్ ఓ ఇన్‌స్పిరేషనల్ ట్వీట్ చేశాడు.

‘జీవితంలో విజయం సాధించాలంటే పరీక్షలు మాత్రమే అవసరం లేదు. చూసారు గా #HappyDays లో రాజేష్ (నిఖిల్ క్యారెక్టర్) కేవలం ఒక్క ఇంగ్లిష్ పోయంతో సాఫ్ట్‌వేర్‌లో మంచి ఉద్యోగం వస్తుంది. అలాగే ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో ఒక సమయంలో తమదైన రీతిలో అద్భుతమైన అవకాశాన్ని పొందుతారు. దానిని సమర్థంగా వినియోగించుకోండి. ఎల్లప్పుడూ ధైర్యంగా ఉండండి’ అంటూ అదిరిపోయే కొటేషన్ పెట్టాడు నిఖిల్. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. చాలా మంచి కొటేషన్ ఇచ్చావ్ అన్నా అంటూ అభిమానులు, నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. కాగా సుమారు 16 ఏళ్ల క్రితం హ్యాపీడేస్ సినిమాతో హీరోగా పరిచయమ్యడు నిఖిల్. ఇందులో రాజేశ్ అనే అల్లరి చిల్లరిగా తిరిగే ఇంజనీరింగ్ విద్యార్థి పాత్రలో అందరినీ ఆకట్టుకున్నాడు.

ఇవి కూడా చదవండి

హీరో నిఖిల్ పోస్ట్..

ఏప్రిల్ 19 న హ్యాపీడేస్ రీ రిలీజ్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.