Shyam Singha Roy Twitter Review: శ్యామ్ సింగరాయ్ ప్రజలను మెప్పించాడా ?..  ట్విట్టర్ రివ్యూ.. 

న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన

Shyam Singha Roy Twitter Review: శ్యామ్ సింగరాయ్ ప్రజలను మెప్పించాడా ?..  ట్విట్టర్ రివ్యూ.. 
Shyam Singha Roy

Updated on: Dec 24, 2021 | 7:44 AM

న్యాచురల్ స్టార్ హీరో నాని ప్రధాన పాత్రలో నటించిన లేటేస్ట్ చిత్రం శ్యామ్ సింగరాయ్. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తెరకెక్కించిన ఈ మూవీలో నాని సరసన సాయి పల్లవి, కృతి శెట్టి, సెబాస్టియన్ మడోన్నా హీరోయిన్లుగా నటించారు. కలకత్తా నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని రెండు విభిన్న పాత్రలలో కనిపించనున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై మరింత అంచనాలను పెంచేశాయి. ఇదిలా ఉంటే..చిత్రాన్ని నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పతాకంపై వెంకట్ బోయనపల్లి నిర్మించారు. ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ మూవీ ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్, యూఎస్ లో ప్రిమియర్స్ చూసిన పబ్లిక్ ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. మరీ శ్యామ్ సింగరాయ్ ప్రజలను మెప్పించాడా ? లేదో ? తెలుసుకుందామా.

గత కొన్ని ఏళ్లుగా నాని సూపర్ హిట్ అందుకోవడానికి కష్టపడుతున్నారు. వీ.. టక్ జగదీష్ సినిమాలు మంచి టాక్ సంపాదించుకోగా.. ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయాయి. దీంతో ఈసారి సూపర్ హిట్ అందుకోవడానికి నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తాజాగా విడుదలైన శ్యామ్ సింగరాయ్ మంచి టాక్ సంపాదించుకుంది. నాని, సాయి పల్లవి జోడి ఈ సినిమాలో హైలేట్ అని.. బ్యాగ్రౌండ్ స్కోర్ వీరలెవల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అలాగే క్లైమాక్స్ సీన్స్ కూడా సినిమాకు మరో హైలెట్ అంటున్నారు. ఈ సినిమాతో నాని సూపర్ హిట్ అందుకోవడం ఖాయంగానే కనిపిస్తున్నారు.

Also Read: Radhe Shyam Trailer: ప్రాణం పోసే ప్రేమ ప్రాణం తీయగలదా.. రాధేశ్యామ్ ట్రైలర్ అదుర్స్..

Thaggedhe Le: ‘తగ్గేదే లే’ డైలాగ్ చెప్పిన క్రికెటర్ జడేజా.. పుష్ప ఫీవర్ మాములుగా లేదుగా..

Pushpa: యూట్యూబ్‌లో సెన్సేషన్‌ క్రియేట్‌ చేసిన శ్రీవల్లి సాంగ్‌.. 100 మిలియన్ల వ్యూస్‌ను దాటేసి..