Tollywood Drug Case: ఓవైపు కొనసాగుతున్న నందు విచారణ.. మరోవైపు ఈడీ ఆఫీస్‌కు చేరుకున్న కెల్విన్..

Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తును ఈడీ అధికారులు వేగవంతం చేశారు. తాజాగా నటుడు నందు ఈడీ విచారణకు హాజరయ్యాడు. ఆయనని ఈడీ అధికారులు గత కొన్ని గంటలుగా..

Tollywood Drug Case: ఓవైపు కొనసాగుతున్న నందు విచారణ.. మరోవైపు ఈడీ ఆఫీస్‌కు చేరుకున్న కెల్విన్..
Nandu

Updated on: Sep 07, 2021 | 3:30 PM

Tollywood Drug Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు దర్యాప్తును ఈడీ అధికారులు వేగవంతం చేశారు. తాజాగా నటుడు నందు ఈడీ విచారణకు హాజరయ్యాడు. ఆయనని ఈడీ అధికారులు గత కొన్ని గంటలుగా ప్రశ్నిస్తున్నారు. నందు బ్యాంక్ ఖాతాలు, అనుమానాస్పద లావాదేవీల గురించి ఈడీ ఆరా తీస్తున్నారని సమాచారం. ఓ వైపు నందు విచారణ కొనసాగుతుండగానే ఈ కేసులో కీలక పాత్రధారి కెల్విన్ ను ఈడీ కార్యాలయానికి రప్పించారు. భారీ బందోబస్తు మధ్య ఇన్నోవా కార్లో ఈడి కార్యాలయానికి  కెల్విన్ చేరుకున్నాడు. నందు ను కెల్విన్ సమక్షంలో ఈడీ అధికారులు విచారించనున్నట్లు తెలుస్తోంది. ఇరువురిని ప్రశ్నించి కీలక ఆధారాలు వెలికితీసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

రేపు రానా విచారణ నేపథ్యంలో ముందుగా కెల్విన్ దగ్గర స్టేట్మెంట్ ను ఈడీ అధికారులు రికార్డ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, నటి, నిర్మాత ఛార్మి, నటి రకుల్ ప్రీత్ సింగ్​లను విచారించారు. మనీలాండరింగ్ కేసులో నటుడు నందుకు ఈడీ నోటీసులు జారీ చేసింది. షెడ్యూల్ ప్రకారం ఈనెల 20న నందు విచారణకు హాజరుకావాల్సి ఉంది.  అయితే నందు తనకు షూటింగ్ ఉన్నదని.. అందుకని ముందుగా విచారించాలని నందు అధికారులను కోరగా.. వారు సానుకూలంగా స్పందించిన సంగతి తెలిసిందే..

 

Also Read:  చ‌వితినాటి విగ్రహం, పత్రి , పిండివంటల సంప్రదాయంలో దాగిన విజ్ఞానం, సైన్స్ మీకు తెలుసా..