Murali Sharma: ‘నార్త్ ఇండియన్ కాదు.. నాది పక్కా గుంటూరు.! నా భార్య కూడా యాక్టరే..’

టాలీవుడ్ నటుడు మురళీ శర్మ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి పలు కీలక విషయాలు పంచుకున్నారు. 'భలే భలే మగాడివోయ్' చిత్రంతో గుర్తింపు పొందిన ఆయన.. కొందరు తనను నార్త్ ఇండియన్ అనుకుంటారని.. తెలుగులో మాట్లాడగలనని.. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి లుక్కేయండి.

Murali Sharma: నార్త్ ఇండియన్ కాదు.. నాది పక్కా గుంటూరు.! నా భార్య కూడా యాక్టరే..
Murali Sharma

Updated on: Jan 23, 2026 | 12:49 PM

టాలీవుడ్ నటుడు మురళీ శర్మ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంపై పలు కీలక విషయాలను పంచుకున్నారు. ‘భలే భలే మగాడివోయ్’ చిత్రంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న మురళి శర్మ.. ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా, విలన్‌గా మంచి విజయాలు సాధించడమే కాకుండా వరుసగా అవకాశాలు అందుకున్నారు.

ఇది చదవండి: ‘ఆ సాంగ్ వల్లే హీరోయిన్‌గా సినిమాలు మానేశా.!’

అందరూ తనది నార్త్ ఇండియా అని అనుకుంటారని.. కానీ మా ఫ్యామిలీ మూలాలు పక్కా గుంటూరు నుంచి అని చెప్పారు. తన పాత్రకు తాను డబ్బింగ్ చెబుతానని స్పష్టం చేశారు. అలాగే తనది లవ్ మ్యారేజ్ అని చెప్పిన మురళి శర్మ.. తన భార్య కూడా ఓ నటి అని చెప్పుకొచ్చారు. అలాగే పప్పు అన్నం, సాంబార్ తనకు బాగా ఇష్టమని అన్నారు మురళి శర్మ. అల వైకుంఠపురములో.. గుంటూరు కారం, సరిపోదా శనివారం, ఆంధ్రా కింగ్ తాలుకా, దేవర, భీమ్లా నాయక్, మేజర్.. ఇలా స్టార్ హీరోల సినిమాల్లో పలు కీలక రోల్స్ చేసి.. తన నటనతో మంచి పేరు సంపాదించారు మురళి శర్మ.

ఇవి కూడా చదవండి

ఇది చదవండి: షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏమన్నారంటే.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..