Mohan Babu: ఆరు నెలలు పనిచేయించుకుని 50 రూపాయాలు జీతం ఇచ్చారు.. మోహన్ బాబు ఆసక్తికర విషయాలు..

|

Sep 30, 2021 | 8:42 AM

డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. తెలుగు ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. విలన్‏గా కెరీర్ మొదలుపెట్టిన

Mohan Babu: ఆరు నెలలు పనిచేయించుకుని 50 రూపాయాలు జీతం ఇచ్చారు.. మోహన్ బాబు ఆసక్తికర విషయాలు..
Mohan Babu
Follow us on

డైలాగ్ కింగ్ మోహన్ బాబు.. తెలుగు ఇండస్ట్రీలోనే తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్నాడు. విలన్‏గా కెరీర్ మొదలుపెట్టిన ఆయన ఆ తర్వాత స్టార్ హీరోగా మారి సినీ పరిశ్రమను ఏలారు. విభిన్న కథలతో.. విలక్షణమైన పాత్రలు పోషించిన మోహన్ బాబు.. తన డైలాగ్స్‏తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. భయంకరమైన విలన్ పాత్ర చేయడమే కాకుండా.. విలనిజంలో కామెడిని పండించడం కూడా మోహన్ బాబుకే చెల్లింది. కేవలం హీరోగానే కాకుండా.. నిర్మాతగానూ సక్సెస్ అయ్యారు మోహన్ బాబు. వరుసగా సూపర్ హిట్ చిత్రాల్లో నటించి స్టార్ నటుడిగా మారారు. తాజాగా ఆలీతో సరదాగా కార్యక్రమంలో పాల్గోన్న ఆయన.. తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల గురించి చెప్పుకొచ్చారు.

మోహన్ బాబు మాట్లాడుతూ.. నేను పుట్టిపెరిగింది చిత్తూరు జిల్లా మోదుగుపాలెం. నా అసలుపేరు భక్తవత్సలం నాయుడు. స్వర్గం నరకం సినిమా షూటింగ్ కోసం విజయవాడ వెళ్లాను..మోహన్ బాబు ఇలా రావయ్యా అని దాసరి నారాయణ రావు గారు పిలిచారు. నన్ను కాదు.. ఎవరిని పిలుస్తున్నారా అని చుట్టూ చూశాను.. నిన్నేనయ్యా.. ఇక నుంచి నీ పేరు మోహన్ బాబు అన్నారు. ఇదే విషయాన్ని మా అమ్మతో చెప్పినప్పుడు నా కళ్ల వెంట నీళ్లొచ్చాయి. అలా నటుడిగా మోహన్ బాబు ప్రయాణం మొదలైంది అంటూ చెప్పుకొచ్చారు.

ఇక ఈ తర్వాత అన్నగారు చేసిన రాజమకుటం చూసిన తర్వాత నటుడిగా మారాలనే కోరిక కలిగింది. అదే సమయంలో ముందుగా విలన్ గా చేయాలనే ఆసక్తి ఉండేది. ఆ కోరికతో చెన్నై వెళ్లిన నేను ఒక స్కూల్లో డ్రిల్ మాస్టర్‏గా చేరాను. నెలకు రూపాయలు ఇచ్చారు. కానీ ఆ తర్వాత నా కులం వేరని చెప్పిన నన్ను ఉద్యోగంలో నుంచి తీసేసారు. అందుకే నా స్కూల్ కి సంబంధించిన అప్లికేషన్ ఫాంలో కులం అనే కాలం తీసేశాను. ఉద్యోగం పోయాక ఏ చేయాలో తెలియలేదు. ఎక్కడైన అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తూ.. వేషాల కోసం ట్రై చేయవచ్చు అనుకున్నాను. అలా నాకు అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం ఇప్పించింది ప్రభాకర్ రెడ్డి గారు. ఆ తర్వాత అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలోనే వేషాలు ఇప్పించమని కృష్ణగారిని అడిగేవాడని.. ఆయన చెప్పడంతో అల్లూరి సీతారామరాజు సినిమాలో సీతకు భర్త పాత్ర ఇచ్చారు. అది చిన్న పాత్ర అయినా.. ఆ తర్వాత కన్నవారి కలలు సినిమాలో విలన్ పాత్ర చేశాను. అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న సమయంలో 6 నెలలు పనిచేయించుకుని జీతంగా రూ. 50 ఇచ్చారని చెప్పుకొచ్చారు మోహన్ బాబు. ఆ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అవకాశం ఇప్పించిన ప్రభాకర్ రెడ్డి గారు.. నన్ను హీరోగా పెట్టి గృహ ప్రవేశం సినిమా చేస్తే 25 వారాలు ఆడింది.. అందులో దారి చూపిన దేవత పాటను ఏసుదాసుగారు పాడారు. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య మంచి పరిచయం ఏర్పడిందని మోహన్ బాబు చెప్పుకొచ్చారు.

Also Read: Maa Elections 2021: మా ఎన్నికల జోరు.. ఆసక్తికర ట్వీట్ చేసిన ప్రకాష్ రాజ్..

Radhe Shyam: సంక్రాంతి బరిలో ప్రభాస్.. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ కన్ఫార్మ్ చేసిన మేకర్స్..