Mansoor Ali Khan: జైలర్ సినిమాలకే తమన్నా పాట పై షాకింగ్ కామెంట్స్ చేసిన లియో యాక్టర్..

రజినీకాంత్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమా సక్సెస్ కు మ్యూజిక్ ఎంత పెద్ద ప్లెస్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా పాపులర్ అవడంతో పాటు ఈ మూవీలో ‘కావాలయ్యా అనే సాంగ్ వైరల్ గా మారింది. 'కావాలయ్యా' పాట ఇన్‌స్టా రీల్స్‌లో మోతమోగిపోయింది. షకీరా మోడల్‌లో తమన్నా కూడా గట్టిగానే  ఆకట్టుకుంది. అందులోనూ ఆ పాటకి హుక్ స్టెప్ బాగా ట్రెండ్ అయ్యింది.

Mansoor Ali Khan: జైలర్ సినిమాలకే తమన్నా పాట పై షాకింగ్ కామెంట్స్ చేసిన లియో యాక్టర్..
Tamanna

Updated on: Oct 26, 2023 | 7:27 AM

రజనీకాంత్‌ నటించిన ‘జైలర్‌’ చిత్రం ఘనవిజయం సాధించింది. జైలర్ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు. రజినీకాంత్ యాక్షన్ తో ఆకట్టుకున్నాడు. అలాగే ఈ సినిమా సక్సెస్ కు మ్యూజిక్ ఎంత పెద్ద ప్లెస్ అయ్యిందో తెలిసిందే. ఈ సినిమా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా పాపులర్ అవడంతో పాటు ఈ మూవీలో ‘కావాలయ్యా అనే సాంగ్ వైరల్ గా మారింది. ‘కావాలయ్యా’ పాట ఇన్‌స్టా రీల్స్‌లో మోతమోగిపోయింది. షకీరా మోడల్‌లో తమన్నా కూడా గట్టిగానే  ఆకట్టుకుంది. అందులోనూ ఆ పాటకి హుక్ స్టెప్ బాగా ట్రెండ్ అయ్యింది. అయితే ఇప్పుడు ఆ పాటలో కూడా తమన్నా డ్యాన్స్ చేసిన తీరుపై ఓ తమిళ నటుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు.

ఇటీవల విడుదలైన ‘లియో’తో పాటు పలు తమిళ చిత్రాల్లో నటించిన నటుడు మన్సూర్ అలీఖాన్ ‘సరకు’ అనే చిత్రాన్ని రూపొందించగా, సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి చాలా కట్‌లు సూచించింది. ఆ తర్వాత విలేకరుల సమావేశంలో మాట్లాడిన మన్సూర్ అలీఖాన్.. ‘కావాలయ్యా ’ పాట గురించి ప్రస్తావించాడు.

కావాలయ్యా’ పాట చాలా చెత్తగా ఉంది. ఆ పాటలో, తమన్నా చిరిగిన బట్టలు ధరించి, ‘కావాలా’ ‘కావాలయ్యా’ అని అడుగుతూ ఆమె చేతులతో సైగలు చేసింది అసలు ఆ పాటలో, తమన్నా ఏదో వైపు చూపిస్తూ తనకు ఏమి కావాలో అడుగుతోంది. సెన్సార్ సభ్యులు ఆ పాటను ఎందుకు తొలగించలేదు..? అని అన్నారు. జైలర్’ సినిమాలోని కావాలయ్యా పాట వైరల్‌గా మారింది. పాటలోని హుక్ స్టెప్‌ను కూడా సెలబ్రిటీలతో సహా నెటిజన్లు రీక్రియేట్ చేసి రీల్స్‌ను చేశారు. కొన్ని షోలలో తమన్నా స్వయంగా ఆ పాటకు డ్యాన్స్ కూడా చేసింది. అత్యంత పాపులర్ అయిన పాట డాన్స్ గురించి మన్సూర్ అలీ ఖాన్ తక్కువ చేసి మాట్లాడడంపై నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మన్సూర్ అలీఖాన్ చాలా సంవత్సరాలు సహాయ నటుడిగా ,విలన్ గా ,  హాస్యనటుడిగా ప్రసిద్ధి చెందారు. మన్సూర్ అలీఖాన్ కొన్ని తమిళ, తెలుగు, కన్నడ సినిమాల్లో నటించారు. తను తీసిన సినిమా సెన్సార్ సమస్యని ఎదుర్కొంటోంది కాబట్టే ఇప్పుడు ‘జైలర్ ‘ పాటపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ‘సెన్సార్ సభ్యులు ఇలాంటి వాటిని పట్టించుకోరు అంటూ కామెంట్స్ చేశాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి