Tollywood: టాలీవుడ్ స్టార్‏తో ప్రేమ, పెళ్లి.. కట్ చేస్తే.. సినిమాలకు దూరమైన మిస్ ఇండియా.. ఇప్పుడు

కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో సినీతారల చిన్ననాటి ఫోటోస్ తెగ వైరలవుతున్న సంగతి తెలిసిందే. బాల్యంలో తమకు నచ్చిన హీరోహీరోయిన్స్ ఎలా ఉన్నారో తెలుసుకోవడానికి నెటిజన్స్ తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే చైల్డ్ హుడ్ ఫోటోస్ ట్రెండ్ నెట్టింట పాపులర్ అయ్యింది. ఈ క్రమంలో తాజాగా టాలీవుడ్ హీరోయిన్.. మిస్ ఇండియా త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..

Tollywood: టాలీవుడ్ స్టార్‏తో ప్రేమ, పెళ్లి.. కట్ చేస్తే.. సినిమాలకు దూరమైన మిస్ ఇండియా.. ఇప్పుడు
Namratha

Updated on: Apr 11, 2025 | 7:57 AM

సోషల్ మీడియాలో ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో ఎక్కువగా వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న గ్రీన్ కలర్ సారీ అమ్మాయి తెలుగులో తోపు హీరోయిన్. అంతేకాదు.. మిస్ ఇండియా కూడా. తెలుగులో స్టార్ హీరోలకు జోడిగా నటించి మెప్పించింది. తాజాగా ఆమె తన చెల్లెలితో కలిసి ఉన్న ఫోటోనూ ఇన్ స్టా వేదికగా షేర్ చేసింది. నిన్న తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా తన చెల్లెలితో కలిసి ఉన్న ఫోటోను నెట్టింట పంచుకుంటూ మై ఫేవరేట్ పర్సన్ ఇన్ మై లైఫ్ అంటూ తన చెల్లిపై ఉన్న ప్రేమను బయటపెట్టింది. దీంతో ఇప్పుడు ఈ త్రోబ్యాక్ ఫోటో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో ఇప్పుడైనా గుర్తుపట్టారా.. ? ఆమె మరెవరో కాదండి.. సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య.. ఒకప్పటి హీరోయిన్ నమ్రత శిరోద్కర్ ఘట్టమనేని.

నిన్న తోబుట్టువుల దినోత్సవం సందర్భంగా తన చెల్లెలితో కలిసి ఉన్న ఫోటను నమ్రత శిరోద్కర్ నెట్టింట షేర్ చేసింది. అలాగే ఆమె చెల్లెలు శిల్పా శిరోద్కర్ సైతం తన అక్క నమ్రతాతో ఉన్న మధురమైన క్షణాలను గుర్తు చేసుకుంది. నా జీవితంలో నువ్వు అతిపెద్ద మద్దతుగా నిలిచే వ్యక్తి నువ్వే అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం ఈ త్రోబ్యాక్ ఫోటోస్ నెట్టింట తెగ వైరలవుతున్నాయి. నమ్రతా శిరోద్కర్.. ఒకప్పుడు మిస్ ఇండియా. ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబు, మెగాస్టార్ చిరంజీవి చిత్రాల్లో నటించి మెప్పించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే మహేష్ బాబును ప్రేమించి పెళ్లి చేసుకుంది. వివాహం తర్వాత సినిమాలకు పూర్తిగా దూరమైన నమ్రత.. ప్రస్తుతం మహేష్ బాబుకు సంబంధించిన బిజినెస్ వ్యవహారాలను చూసుకుంటుంది.

మరోవైపు నమ్రత సిస్టర్ శిల్పా శిరోద్కర్ ఇటీవలే హిందీ బిగ్ బాస్ షోలోకి అడుగుపెట్టింది. ఆ షోలో తన ఆట తీరుతో టాప్ 5లో నిలిచి మరింత ఫేమస్ అయ్యారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

ఇవి కూడా చదవండి :  

Vaishnavi Chaitanya : నా ఫస్ట్ క్రష్ అతడే.. అబ్బాయిల్లో ఫస్ట్ గమనించేవి అవ్వే.. వైష్ణవి చైతన్య సెన్సేషనల్ కామెంట్స్

Parugu Movie: సినిమాలు వదిలేసి సూపర్ మార్కెట్ బిజినెస్‎లోకి.. పరుగు మూవీ హీరోయిన్‏ను ఇప్పుడే చూస్తే షాకే..

Pawan Kalyan- Mahesh Babu: పవన్ కళ్యాణ్ సినిమాలో హీరోయిన్.. మహేష్ బాబు మూవీలో పవర్ ఫుల్ విలన్.. ఇంతకీ ఎవరీ బ్యూటీ..

OTT Movie: ఊహించని ట్విస్టులు.. దిమ్మతిరిగే క్లైమాక్స్.. అంజలి నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీని చూశారా..?