AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Madhusudhan Rao: ఆయన పెద్ద హీరో.. అయినా చిన్నపిల్లాడి మనస్తత్వం.. అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ నటుడు..

నటుడు మధుసూదన్ రావు ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్, వ్యక్తిగత అభిప్రాయాలు, అలాగే ఓ స్టార్ హీరోపై తనకున్న అభిమానం గురించి పంచుకున్నారు. ఆయన కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లోనూ నటించి బహుభాషా నటుడిగా గుర్తింపు పొందారు. భోజ్‌పురిలో ఆరు సినిమాల్లో విలన్‌గా నటించానని, హిందీలో పలు సినిమాల్లో నటించారు.

Madhusudhan Rao: ఆయన పెద్ద హీరో.. అయినా చిన్నపిల్లాడి మనస్తత్వం.. అలాంటి వ్యక్తిని ఎక్కడా చూడలేదు.. టాలీవుడ్ నటుడు..
Madhusudhan Rao
Rajitha Chanti
|

Updated on: Jun 28, 2026 | 11:36 AM

Share

ప్రముఖ నటుడు మధుసూదన్ రావు అటు వెండితెరపై.. ఇటు బుల్లితెరపై తనదైన ముద్ర వేశారు. సినిమాలు, సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సుదీర్ఘ సినీ ప్రస్థానం, వ్యక్తిగత ఆసక్తికర విషయాలు, ముఖ్యంగా నటసింహం నందమూరి బాలకృష్ణపై తనకున్న ప్రగాఢ అభిమానాన్ని వివరించారు. నటుడిగా తన బహుభాషా ప్రజ్ఞను తెలియజేస్తూ, తాను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో నటించానని, భోజ్‌పురిలో ఆరు చిత్రాలలో విలన్‌గా మెప్పించానని చెప్పారు. హిందీలో పలు చిత్రాల్లో నటించానని అన్నారు. భాష తెలియనివాడు ఏదైనా చేస్తేనే తప్పుగా భావిస్తానని, భాష నేర్చుకుని ఏ ప్రాంతంలోనైనా నటించవచ్చని ఆయన అన్నారు. తన గెటప్, లుక్ గురించి అడిగినప్పుడు, తాను సాధారణంగా గడ్డం, మీసం మెయింటైన్ చేస్తానని, అది రగ్గెడ్ లుక్‌కు సరిపోతుందని పేర్కొన్నారు. అయితే, ఒక పోలీస్ ఆఫీసర్ వంటి బలమైన పాత్ర కోసం గడ్డం తీయడానికి సిద్ధంగా ఉంటానని, ఆ పాత్రకు సరైన దమ్ముంటేనే ఒప్పుకుంటానని స్పష్టం చేశారు. దర్శకుడు ఎలా డిజైన్ చేస్తే అలా మారడానికి సిద్ధంగా ఉండే డైరెక్టర్స్ ఆర్టిస్ట్‌నని ఆయన తెలిపారు. తన అభిమాన నటీమణులుగా సౌందర్య, స్మితా పాటిల్‌లను మధుసూదన్ రావు గుర్తు చేసుకున్నారు.

ఇంటర్వ్యూలో అత్యంత ఆసక్తికరమైన అంశం నందమూరి బాలకృష్ణపై మధుసూదన్ రావుకున్న అభిమానం. చిరంజీవిని చూసి ఎలా ఎదగాలని నేర్చుకోవచ్చని చెబుతూనే, తనకు మాత్రం బాలయ్యతో బలమైన అనుబంధం ఉందని, ఆయన వ్యక్తిత్వం చాలా కనెక్ట్ అవుతుందని అన్నారు. బాలయ్యను చిన్నపిల్లల మనస్తత్వం కలవారిగా, కల్మషం లేని వ్యక్తి అని అన్నారు. బాలయ్యకు ఏదైనా సమస్య తెలిస్తే వెంటనే ఫోన్ చేసి సహాయం చేస్తారని, ఆసుపత్రి వంటి విషయాల్లో పీఏలు లేకుండా తానే స్వయంగా మాట్లాడుకుని పరిష్కరిస్తారని మధుసూదన్ రావు పేర్కొన్నారు. సెట్‌లో బాలయ్య క్యారవాన్ దిగి వస్తే, సూర్యరశ్మిలో కూర్చుంటారని, ఫైట్ చేసేటప్పుడు అద్భుతమైన ఎనర్జీ చూపిస్తారని వివరించారు.

చాలామంది నటీనటులు బాలయ్య గురించి ఇదే చెబుతారని, ఆయన మనసులో ఏదీ పెట్టుకోకుండా ఆ సమయానికి కోపం వచ్చినా, వెంటనే మర్చిపోయి మనిషికి విలువ ఇస్తారని మధుసూదన్ రావు చెప్పారు. బాలయ్య ట్రోల్స్‌ను కూడా పట్టించుకోకుండా, వాటిని ఎంజాయ్ చేస్తారని తెలిపారు. మధుసూదన్ రావు తాను హీరోల్లో అత్యధిక సినిమాలు బాలయ్యతోనే చేశానని, సుమారు ఏడు నుండి ఎనిమిది చిత్రాలలో కలిసి పనిచేశానని పేర్కొన్నారు. తనలాంటి నటులకు దేవుడు ఎలాంటి గెటప్‌కైనా సరిపోయే కటౌట్ ఇచ్చారని, దర్శకుల ఆలోచనలకు అనుగుణంగా మారడమే ఒక నటుడికి ఉత్తమమని మధుసూదన్ రావు చెప్పుకొచ్చారు.

ఎక్కువమంది చదివినవి : RRR Movie : అబ్బబ్బా.. ఏం మారింది భయ్యా.. ఆర్ఆర్ఆర్ సినిమా మల్లీని చూశారా.. ? అచ్చం హీరోయిన్‏లాగే ఉందిగా..

బాలకృష్ణ ఫోటో..

Madhusudhan Rao, Balakrishn

Madhusudhan Rao, Balakrishn

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఖుష్బూ కూతురి పెళ్లిలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ సందడి.. స్పెషల్ అట్రాక్షన్‏గా త్రిష.. వీడియోస్ ఇదిగో..

Follow Us