
టాలీవుడ్ ఇండస్ట్రీలో విలన్‌గా, కమెడియన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనదైన ముద్ర వేశారు దివంగత సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు. ఆయన గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది. ఆ ఇంటర్వ్యూలో ఆయన తన కెరీర్, ఇండస్ట్రీలోని పలు అంశాలపై చర్చించారు. తాను ఎన్నడూ అవకాశాల కోసం ఎవరినీ వెళ్లి అడగలేదని, అది తన బ్యాడ్ హ్యాబిట్ లేదా గుడ్ హ్యాబిట్ కావచ్చు అని పేర్కొన్నారు. కరోనా ముందు వరకు దాదాపు 20 గంటలు పని చేసిన తనకి.. ఆ తర్వాత పనిలేకుండా ఖాళీగా ఉన్నానని తెలిపారు.
ఆ సమయంలో తనకు ఆఫర్లు లేక ఖాళీగా ఉండగా.. పవన్ కళ్యాణ్, చిరంజీవి, త్రివిక్రమ్, వినాయక్ లాంటివారికి ఫోన్ చేసి.. ‘డబ్బు కాదు, కాస్త సరదాగా వేషాలు ఏమైనా ఉంటే ఇవ్వొచ్చు కదా’ అని పరోక్షంగా అడిగినట్టు చెప్పారు. అలా క్రిష్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వచ్చిన ‘హరిహరవీరమల్లు’ చిత్రంలో కోట శ్రీనివాసరావు నటించగా.. అదే ఆయన చివరి సినిమా. తన కెరీర్ పట్ల, జీవితం పట్ల తనకు పూర్తి సంతృప్తి ఉందని ఆ ఇంటర్వ్యూలో కోట శ్రీనివాసరావు తెలిపారు. కళామతల్లిని నమ్ముకుని సామాన్యుడిగా వచ్చి నటుడిగా ఎదిగి, పద్మశ్రీ పురస్కారం అందుకున్నందుకు గర్వంగా ఉన్నానన్నారు. తన జీవితంలో ఏ రూపాయి కూడా అప్పు లేదని, సంపాదించిన దానికి ఎంతో సంతృప్తిగా ఉన్నానని చెప్పారు. తన సంపద ఎంతో తనకు స్పష్టంగా తెలుసని, అంబానీలు, టాటా బిర్లాలకు ఉన్నంత లేకపోయినా, తన తృప్తే తనకు ముఖ్యమని అన్నారు. తన అత్యధిక రెమ్యూనరేషన్ ఒక లక్షా యాభై వేల రూపాయలు అని తెలిపారాయన.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..