ఉదయ్ కిరణ్‌ను మానసికంగా హింసించారు.. అతను చనిపోవడమే బెటర్.. షాకింగ్ విషయం చెప్పిన నటుడు

సినిమా ఇండస్ట్రీలో ఉదయ్ కిరణ్ ఓ ధ్రువతారలా వెలిగాడు. మొదటి సినిమా చిత్రంతోనే సూపర్ హిట్ సొంతం చేసుకున్నాడు. యూత్ లో మంచి క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆపై నువ్వు నేను సినిమా తో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అంతేకాదు ఈ సినిమా ఉదయ్ స్టార్ డమ్ ను అమాంతం పెంచేసింది. ఆ తర్వాత వచ్చిన మనసంతా నువ్వే కూడా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది

ఉదయ్ కిరణ్‌ను మానసికంగా హింసించారు.. అతను చనిపోవడమే బెటర్.. షాకింగ్ విషయం చెప్పిన నటుడు
Uday Kiran

Updated on: Jul 09, 2025 | 8:55 AM

ఉదయ్ కిరణ్ పేరు చెప్పగానే ఎదో తెలియని ఫీలింగ్ కలుగుతుంది. మన ఇంట్లో సభ్యుడు. మనకు బాగా తేలినవాడు అనే భావన కలుగుతుంది. అలాగే తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తాయి. స్టార్ హీరో గా రాణించాల్సిన వాడు అనుకోని విధంగా తిరిగిరాని లోకాలకు వెళ్ళిపోయాడు. చిత్రం సినిమాతో హీరోగా పరిచయమైన ఉదయ్ కిరణ్ వరుసగా సినిమాలు చేసి భారీగా అభిమానులను సొంతం చేసుకున్నాడు. అలాగే లవర్ బాయ్ అనే ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు. వరుసగా చిత్రం, నువ్వు నేను, మనసంతా నువ్వే, కలుసుకోవాలని సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అంతే కాదు.. అమ్మాయిల కలల రాకుమారుడుగా మారిపోయాడు ఈ స్టార్ హీరో..

కెరీర్ పీక్ లో ఉండగానే ఉదయ్ పెళ్లి చేసుకున్నాడు. అంతా బాగుంది అనుకునేలోగా ఉదయ్ కెరీర్ డల్ అవుతూ వచ్చింది. అతనికి సినిమాలు తగ్గడం మొదలయ్యాయి. చేసిన సినిమాలు కూడా అంతగా ఆకట్టుకోలేకపోయాయి. దాంతో ఉదయ్ డిప్రషన్ లోకి వెళ్ళాడు. ఆతర్వాత తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు ఉదయ్. ఉదయ్ కిరణ్. అయితే ఉదయ్ కిరణ్ చనిపోవడమే బెటర్ అని ఓ నటుడు షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఉద‌య్ కిర‌ణ్ మ‌ర‌ణించ‌డ‌మే మంచిది అంటూ కామెంట్స్ చేసిన ఆ నటుడు ఎవరో కాదు బిగ్ బాస్ విన్నర్ కౌశ‌ల్ మందా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కౌశల్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

ఇవి కూడా చదవండి

ఉదయ్ కిరణ్ సినిమాల్లోకి రాక ముందు నుంచే నాకు తెలుసు.. బేగం పేటలో ఉండేవాడు. ఎంతో కష్టపడి పడి ఎదిగాడు.. కానీ ఇండస్ట్రీలో ఎదుగుతుంటే ఓర్చుకోలేరు. పైకి ఎదిగేవాడిని కిందకు లాగడంమీ ఇక్కడి నైజం. ఉదయ్ కిరణ్ ను ఎంత మానసికంగా హింసించారో నేను దగ్గరుండి చూశా.. ఇంత టార్చర్ అనుభవించడం కంటే చనిపోవడమే బెటర్ అనుకున్నాడు.. చనిపోయిన తర్వాతైనా తన ఆత్మకు శాంతి కలుగుతుందని ఆశిస్తున్నా అని కౌశల్ అన్నాడు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఈ కామెంట్స్ పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..