RRR Movie: ఆర్ఆర్ఆర్ హంగామా షూరు.. ఆకాశంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పనికి ఫిదా కావాల్సిందే..

|

Mar 13, 2022 | 2:58 PM

దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ (RRR) రచ్చ మొదలైంది. మరో పన్నెండు రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.

RRR Movie: ఆర్ఆర్ఆర్ హంగామా షూరు.. ఆకాశంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేసిన పనికి ఫిదా కావాల్సిందే..
Ntr
Follow us on

దేశ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ (RRR) రచ్చ మొదలైంది. మరో పన్నెండు రోజుల్లో ఆర్ఆర్ఆర్ సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నచించిన ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ట్రైలర్స్.. సాంగ్స్ ఆర్ఆర్ఆర్ అంచనాలను భారీగానే పెంచేశాయి. చరిత్రలో ఎన్నడు కలవని ఇద్దరూ వీరలను మొదటిసారి వెండితెరపై స్నేహితులుగా చూపించబోతున్నాడు జక్కన్న.. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మార్చి 25న పాన్ ఇండియా లెవల్లో గ్రాండ్‎గా విడుదల కాబోతుంది. సినిమా విడుదల తేదీ దగ్గరపడుతుండంతో ఇప్పటినుంచి ఆర్ఆర్ఆర్ సందడి షూరు అయ్యింది.

కేవలం మన దగ్గర మాత్రమే కాదు.. విదేశాల్లోనూ చరణ్, ఎన్టీఆర్ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా కోసం తాము ఎంతగా ఎదురుచూస్తున్నారో చెప్పకనే చెబుతున్నారు. మెగా.. నందమూరి అభిమానులు నెట్టింట్లో ఆర్ఆర్ఆర్ హ్యాష్‏ట్యాగ్‏తో హంగామా చేస్తున్నారు. అయితే తారక్ అభిమానులు.. తమ హీరో సినిమా కోసం సందడి ప్రారంభించారు. ఇప్పటికే కెనడాలో కార్లతో కలిసి ఆర్ఆర్ఆర్ అని.. ఎన్టీఆర్ అంటూ డిజైన్ చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. తాజాగా మరికొంతమంది అభిమానులు ఎన్టీఆర్ పై తమ ప్రేమను తెలియజేశారు. అమెరికాకు చెందిన యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఓ చిన్నపాటి విమానంకు బ్యానర్ కట్టి ఆకాశంలో ఎగరవేశారు. దానిపై తొక్కుకుంటూ పోవాలే.. జై ఎన్టీఆర్ అంటూ పెద్ద పెద్ధ అక్షరాలతో రాసి ఆకాశంలో ప్రదర్శించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు.. ఫోటోస్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

డైరెక్టర్ రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ అలియా భట్.. హాలీవుడ్ బ్యూటీ ఒలివియా మోరీస్ .. అక్షయ్ కుమార్.. శ్రియా శరణ్ కీలకపాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని భారీ బడ్జె్ట్‏తో డీవీవీ బ్యానర్ పై దానయ్య నిర్మిస్తున్నారు.

Also Read: Rashmika Mandanna: సమంత బాటలో నడవనున్న రష్మిక.? బీటౌన్‌లో చక్కర్లు కొడుతోన్న క్రేజీ న్యూస్‌..

Telugu Indian Idol: తెలుగు ఇండియన్ ఐడల్ ఎపిసోడ్ 6.. టాప్‌- 12 కంటెస్టెంట్లు ఎవరంటే..

Kandikonda: స్వగ్రామం నాగుర్లపల్లిలోనేడు కందికొండ అంత్యక్రియలు.. బంధువుల కోరిక మేరకు చివరి నిమిషంలో మార్పు

Naga Babu: ఇకపై నా పూర్తి సమయాన్ని అందుకే వినియోగిస్తాను.. నెట్టింట్లో వైరలవుతోన్న నాగబాబు పోస్ట్‌..