Jr.NTR: వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్.. వారి కోసం భారీగా విరాళం..

ఇటీవల కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు

Jr.NTR: వరద బాధితులకు అండగా నిలిచిన ఎన్టీఆర్.. వారి కోసం భారీగా విరాళం..
Ntr

Updated on: Dec 01, 2021 | 5:39 PM

ఇటీవల కురిసిన వర్షాలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోన్న సంగతి తెలిసిందే. చిత్తూరు, కడప జిల్లాల్లో కురిసిన వర్షాలకు ఇళ్లు… చెట్లు నేలమట్టం కాగా.. రహదారులు నదులను…కాలువలను తలపించాయి. భారీ వర్షాలకు పలు జిల్లాల ప్రజలు తీవ్రంగా నష్టపోయారు. వరద బాధితులకు కోసం ఇప్పటికే ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. తాజాగా వరద బాధితుల కష్టాలను చూసి చలించిన జూనియర్ ఎన్టీఆర్ తన వంతు సాయాన్ని ప్రకటించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వరద బాధితుల కోసం జూనియర్ ఎన్టీఆర్.. రూ. 25 లక్షల విరాళాన్ని ప్రకటించారు. వరదల వలన ఇబ్బందులు ఎదుర్కోంటున్న వారిని ఆదుకోవడానికి తన వంతు సాయం చేస్తున్నట్లుగా ఎన్టీఆర్ తెలిపారు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు తారక్..

ట్వీట్..

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం తారక్.. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు. ఇందులో రామ్ చరణ్ సైతం లీడ్ రోల్ పోషిస్తుండగా.. అలియాభట్, ఒలివియా, అజయ్ దేవగణ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమానే కాకుండా.. ఎన్టీఆర్.. కొరటాల శివ దర్శకత్వంలో మరో మూవీ చేయనున్నాడు. ఇక మరోవైపు.. బుల్లితెరపై ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ప్రేక్షకులను అలరిస్తున్నారు తారక్.

Also Read: Radhe Shyam: అభిమానులకు షాకిచ్చిన రాధేశ్యామ్ టీం.. నగుమోము తారలే సాంగ్ వాయిదా.. ఎందుకంటే..

Bigg Boss 5 Telugu: హౌజ్‌లో మరోసారి రచ్చ చేసిన సన్నీ.. గట్టిగా అరిచి రాద్ధాంతం చేసిన సిరి..

Viral Video: అలియా లెహెంగాను కాలితో తన్నిన రణ్‌బీర్‌.. నెట్టింట్లో వైరల్‌గా మారిన వీడియో..

Lakshya Trailer: లక్ష్య ట్రైలర్ వచ్చేసింది.. మరోసారి అదరగొట్టిన నాగశౌర్య..