
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు జగపతి బాబు. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్లలో ఆయనంటే ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. 90లో ఫ్యామిలీ హీరోగా అలరించారు. కొన్నాళ్లు సినిమాలకు దూరంగా ఉన్న ఆయన.. ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో దూసుకుపోతున్నారు. లెజెండ్ సినిమాతో ప్రతినాయకుడిగా రీఎంట్రీ ఇచ్చిన ఆయన.. ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలలో మెప్పించారు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓవైపు వరుస చిత్రాలతో బిజీగా ఉన్న ఆయన.. ఇటీవల సోషల్ మీడియాలోనూ ఫుల్ యాక్టివ్ అయ్యారు. తనకు నచ్చింది ఎలాంటి మోహమాటం లేకుండా చెప్పేస్తుంటారు జగపతి బాబు. ఇటీవల తన కూతుర్ల విషయంలో తన నిర్ణయాన్ని చెప్పి వార్తలలో నిలిచారు. తాజాగా తన తల్లి నివాసాన్ని ప్రేక్షకులకు చూపించారు.
గురువారం శ్రీరామనవమి సందర్భంగా జగపతి బాబు తన తల్లి నివాసానికి వెళ్లారు. హైదరాబాద్ లోని తన తల్లి ఉంటున్న ఇల్లు చూపిస్తూ ఓ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. నవమి సందర్భంగా పానకం తాగడానికి తన తల్లి ఇంటికి వచ్చానని చెప్పాడు. “అందరకీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు. పానకం తాగాలనిపిచ్చింది. అందుకే మా అమ్మ ఇంటికి వచ్చాను. ఈ ప్లేస్ అంతా ఒక అడవిలా ఉంటుంది. కానీ హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది. అమ్మ పానకం ఇస్తాను రా అంటే వచ్చాను. పానకం ఒక్కటే సరిపోదు.. నూకలతోప కావాలని అన్నాను ఈ పేరు మీరు విన్నారో లేదో తెలీదు. దాన్ని తిని ఓ పాతిక సంవత్సరాలు అయినట్లుంది. చాలా కాలం తర్వాత అమ్మ చేతితో భోజనం చేయబోతున్నాను.
అమ్మ ఉండే ప్రదేశం ఒకే ఒక్క రూమ్. తను చాలా సంతోషంగా ఉంటుంది. ఇదంతా అమ్మ ఉండే స్థలం. ఒక యోగి.. యోగిని అంటారే ఆ టైపులో తను సెటిల్ అయిపోయింది. ” అంటూ చెప్పుకొచ్చారు జగపతి బాబు. అయితే తన తల్లిని మాత్రం చూపించలేదు. నిజంగానే జగపతి బాబు తల్లి ఉండే గది అడవి మధ్యలో ఉన్నట్లుంది. చుట్టూ చెట్లు.. మధ్యలో చిన్న దారి.. అక్కడే ఋషి విగ్రహం చూస్తుంటే ఓ తపోవనం లా కనిపిస్తోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.