Chatrapathi Hindi teaser: టీజర్ ఎలా అనిపించింది.. అల్లుడు శ్రీను బాలీవుడ్‌లో జెండా పాతేస్తాడా..?
బెల్లంకొండ శ్రీనివాస్ బాలీవుడ్‌పై అంత నమ్మకంగా ఉండటానికి కారణం అదేనా..? స్టార్ హీరోలే హిందీ మార్కెట్ వస్తుందా లేదా అని భయపడుతుంటే.. బెల్లంకొండ మాత్రం అంత ధైర్యంగా ముందడుగేయడానికి రీజన్ ఏంటి..? 17 ఏళ్ళ కింద వచ్చిన ఛత్రపతి రీమేక్‌తో నార్త్‌లో ఈ హీరో ఎంతవరకు మ్యాజిక్ చేయబోతున్నారు..? అసలు ఛత్రపతి హిందీ రీమేక్ టీజర్ ఎలా ఉంది..?

బాలీవుడ్‌లో సౌత్ డామినేషన్ స్పష్టంగా కనిపిస్తుందిప్పుడు. అందుకే మన హీరోలు కూడా నార్త్ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారు. కాకపోతే అంతా పాన్ ఇండియన్ దండయాత్ర చేస్తుంటే.. బెల్లంకొండ శ్రీనివాస్ మాత్రం నేరుగా ముంబై ట్రైన్ ఎక్కారు. ఛత్రపతి రీమేక్‌తో ఈయన నార్త్ ఆడియన్స్‌కు హాయ్ చెప్తున్నారు. శ్రీరామనవమి సందర్భంగా ఈ చిత్ర టీజర్ విడుదలైంది.
అల్లుడుశ్రీనుతో టాలీవుడ్‌కు బెల్లంకొండను పరిచయం చేసిన వివి వినాయక్.. హిందీలోనూ ఆ బాధ్యత తీసుకున్నారు. తాజాగా విడుదలైన టీజర్ చూస్తుంటే మక్కీ కి మక్కీ తెలుగు సినిమాను దించేసినట్లు తెలుస్తుంది. ఎక్కడా రిస్క్ తీసుకోకుండా రాజమౌళిని ఫాలో అయిపోయారు వినాయక్. మే 12న ఈ సినిమా విడుదల కానుంది.
బెల్లంకొండ శ్రీనివాస్‌కు బాలీవుడ్ ఆశ పుట్టడానికి కారణం యూ ట్యూబ్‌లో ఆయన సినిమాలకు వచ్చే ఆదరణే. ఈ మధ్యే జయ జానకీ నాయకా సినిమాకు 700 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కాని రికార్డ్ ఇది. మిగిలిన సినిమాలకు వందల మిలియన్స్ వ్యూస్ వచ్చాయి. ఇలా అక్కడి వాళ్లకు బెల్లంకొండ పరిచయమే.
Lights. Camera. TOO MUCH ACTION! Literally ?#ChatrapathiTeaser out now: https://t.co/rl6WH6j9dZ
Written by #VijayendraPrasad, directed by #VVVinayak.#Chatrapathi in cinemas on 12th May, 2023.@BSaiSreenivas @Nushrratt @bhagyashree123 @SharadK7 @Penmovies #JayantilalGada pic.twitter.com/eCmfVJ0qQw
— PEN INDIA LTD. (@PenMovies) March 30, 2023
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




