Tollywood: మనం మూవీకి కథ రాసేటప్పుడు నాగార్జున ఒక మాట అన్నారు.. ఓపెన్‌గా చెప్పేసిన హర్షవర్ధన్

టాలీవుడ్ నటుడు హర్షవర్ధన్ మనం సినిమా రాసేటప్పుడు జరిగిన అనుభవాలను ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అక్కినేని నాగేశ్వరరావు చివరి చిత్రం కావడంతో, మూడు తరాల కథను సింపుల్‌గా, సహజంగా చెప్పడం సవాలుగా నిలిచిందన్నారు. దర్శకుడు విక్రమ్ కుమార్ సాయంతో సులభంగా స్టోరీ కంప్లీట్ చేశామన్నాడు.

Tollywood: మనం మూవీకి కథ రాసేటప్పుడు నాగార్జున ఒక మాట అన్నారు.. ఓపెన్‌గా చెప్పేసిన హర్షవర్ధన్
Harshavardhan (1)

Updated on: Feb 02, 2026 | 2:00 PM

టాలీవుడ్ నటుడు, రచయిత హర్షవర్ధన్ మనం సినిమా స్టోరీ వెనుక జరిగిన పలు ఆసక్తికర సంఘటనలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక మైలురాయిగా నిలిచిన మనం సినిమా కోసం మూడు తరాల కథను కలిపి రాయడం ఒక పెద్ద సవాలని అతడు పేర్కొన్నాడు. ఈ కథలో చిన్న మార్పు చేసినా కూడా క్లంజీగా మారే అవకాశం ఉన్నప్పటికీ, దర్శకుడు విక్రమ్ కుమార్ తనపై పెట్టుకున్న నమ్మకంతోనే ఇది సాధ్యమైందని హర్షవర్ధన్ తెలిపాడు. తాను అప్పటికి పెద్దగా పేరున్న రచయిత కాదని, గుండె జారి గల్లంతయ్యిందే సినిమా ఇంకా విడుదల కాకముందే విక్రమ్ కుమార్ మనం కోసం తనను సంప్రదించాడన్నాడు.

అక్కినేని నాగేశ్వరరావు చివరి సినిమా కావడంతో, నాగార్జున స్క్రిప్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, అద్భుతమైన కథ రావాలని ఆశించారు. ఈ కథను సాధారణ ప్రేక్షకులకు సైతం “స్పూన్ ఫీడింగ్” లాగా అర్థమయ్యేలా సింపుల్ చేయడమే తన లక్ష్యంగా పెట్టుకున్నానని హర్షవర్ధన్ వివరించాడు. సహజత్వానికి, రియలిస్టిక్ సంభాషణలకు ప్రాధాన్యత ఇవ్వడం తన అలవాటుగా మారిందని, ఇది నటుడిగా, రచయితగా తన విజయానికి కారణమన్నాడు. మనం రచన సమయంలో దర్శకుడు విక్రమ్ కుమార్ తెలుగు భాష పట్ల చూపించిన అభిమానం తనను ఎంతగానో ప్రభావితం చేసిందని హర్షవర్ధన్ గుర్తుచేసుకున్నాడు.

తాను రాసిన స్క్రిప్ట్‌లో ఇంగ్లీష్ పదాలు ఉన్నా, విక్రమ్ కుమార్ వాటిని తెలుగులోకి మార్చమని పట్టుబట్టేవాడని, ఇది తనకు మరింత స్వేచ్ఛను, ఉత్సాహాన్ని ఇచ్చిందన్నాడు. నాగేశ్వరరావు చిన్ననాటి కథకు తాను వాడిన భాషకు లభించిన అభినందనలు మరచిపోలేనివని తెలిపాడు. రచయితగా గుండె జారి గల్లంతయ్యిందే, మనం వంటి చిత్రాలలో తనకు పూర్తి స్వేచ్ఛ లభించిందని హర్ష వర్ధన్ పేర్కొన్నాడు. ప్రతి సీన్ కొత్తగా, ఊహించని విధంగా, ట్విస్ట్‌లు, టర్న్‌లతో ఉండాలని తాను కోరుకుంటానని, లేకపోతే ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతారని అభిప్రాయపడ్డాడు.

ఇది చదవండి: 

అప్పుడు పెయింటింగ్ వేసేవాడు.. ఇప్పుడు విలన్‌గా లక్షల్లో రెమ్యునరేషన్.. ఈ నటుడు ఎవరంటే.?

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..